Fake News, Telugu
 

వీడియోలోని దృశ్యాలు జూపిటర్ మరియు దాని ఉపగ్రహాలకు చెందినవి, పంచగ్రహ కూటమివి కాదు

0

ఇటీవల ఆకాశంలో ఒకే సమాంతర రేఖపై ఐదు గ్రహాలు కనిపించాయని చెప్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: ఒక సమాంతర రేఖపై ఉన్న ఐదు గ్రహాలను చూపుతున్న దృశ్యాలు

ఫాక్ట్: ఈ దృశ్యాలు జూపిటర్ మరియు దాని ఉపగ్రహాలకు చెందినవి. పంచగ్రహ కూటమికి చెందినవి కాదు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ముందుగా నాసా మరియు ఇతర అంతరిక్ష పరిశోధనా సంస్థలకు చెందిన నిపుణులు ఇచ్చిన సమాచారం ప్రకారం, 28 మార్చి 2023 రాత్రిపూట జూపిటర్, మెర్క్యురీ, వీనస్, యురేనస్, మార్స్ గ్రహాలు దాదాపు ఒకే రేఖపై ఉన్నట్లు కనిపించాయి. కానీ ఇవి పూర్తి కచ్చితత్వంతో ఒకే సరళ రేఖ(straight line) పైకి రాలేదు. వీటిలో వీనస్, మార్స్ ప్రకాశవంతంగా కనిపించాయి. యురేనస్ చాలా తక్కువ కాంతితో కనిపించింది. ఇక సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో దిగంతం (horizon) వద్ద మాత్రమే తక్కువ కాంతి ఉన్న జూపిటర్ మరియు మెర్క్యురీలను చూడవచ్చు. మరిన్ని వివరాలను ఇక్కడ చూడవచ్చు.

ఇక స్టెల్లారియం అనే సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి వైరల్ వీడియోలోని దృశ్యాలను చిత్రీకరించారని తెలిసింది. ఈ సాఫ్ట్‌వేర్ అంతరిక్షంలోని గ్రహాలు, నక్షత్రాలు మరియు ఉపగ్రహాల కదలికలను చూపుతుంది. అయితే వైరల్ వీడియోలో అయిదు గ్రహాలు ఒకదాని పక్కన ఒకటి ప్రకాశవంతంగా ఉన్నట్లు కనిపిస్తున్నవి ఐదు గ్రహాలు కాదని, అవి జూపిటర్ మరియు దాని ఉపగ్రహాలు అని ఈ సాఫ్ట్‌వేర్ ఆధారంగా నిర్దారించవచ్చు.

చివరిగా, వైరల్ వీడియోలోని దృశ్యాలను వరుసగా ఉన్న ఐదు గ్రహాలవి కాదు, అవి జూపిటర్ మరియు దాని ఉపగ్రహాలకు చెందినవి.

Share.

About Author

Comments are closed.

scroll