మన ఇళ్ళలోకి వచ్చే వార్తాపత్రికల ద్వారా కూడా కొరోనా వైరస్ వ్యాపిస్తుందని చెప్తూ ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్: వార్తాపత్రికల ద్వారా కూడా కొరోనా వైరస్ వ్యాపిస్తుంది.
ఫాక్ట్ (నిజం): కోవిడ్-19 వ్యాధి ఉన్న వ్యక్తి తాకడం ద్వారా కొంత సమయం వరకు వార్తాపత్రికలపై కొరోనా వైరస్ ఉండవచ్చని, కానీ వార్తాపత్రికల వల్ల కొరోనా వైరస్ బారిన పడే ప్రమాదం చాలా తక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. అంతేకాదు, కొరోనా వైరస్ వ్యాప్తి వివిధ పరిస్థితుల పై ఆధారపడి ఉంటుంది. కావున పోస్ట్ లో చెప్పింది కొంతవరకు మాత్రమే నిజం.
పోస్టులోని విషయం గురించి వెతకగా, ఈ విషయం పై ప్రపంచ ఆరోగ్య సంస్థ – సౌత్ ఈస్ట్ ఏసియా (WHO – South East Asia) వారు పెట్టిన ట్వీట్ కనిపిస్తుంది. కోవిడ్-19 వ్యాధి ఉన్న వ్యక్తి తాకడం ద్వారా కొంత సమయం వరకు వార్తాపత్రికలపై కొరోనా వైరస్ ఉండవచ్చని, కానీ వార్తాపత్రికల వల్ల కొరోనా వైరస్ బారిన పడే ప్రమాదం చాలా తక్కువని ఆ ట్వీట్ లో చదవొచ్చు. అంతేకాదు, కొరోనా వైరస్ వ్యాప్తి వివిధ పరిస్థితుల పై ఆధారపడి ఉంటుందని వారు తెలిపారు.
కొరోనా వైరస్ ముఖ్యంగా మనుషుల నుండి మనుషులకు సంక్రమిస్తుందని, వైరస్ పడిన ఉపరితలాలు తాకడం వల్ల వైరస్ వ్యాప్తి చాలా తక్కువ అని సీడీసీ (‘Centers for Disease Control and Prevention’) వారి వెబ్సైటులో కూడా చదవొచ్చు.
తాము ప్రచురించే వార్తాపత్రికల ప్రక్రియ చాలా వరకు ఆటోమేటిక్ మెషిన్ల సహాయంతో జరిగిపోతుందని, కావున తమ వార్తాపత్రికల ద్వారా కొరోనా వైరస్ ఎప్పటికి వ్యాప్తి చెందదని చెప్తూ ‘ఎకనామిక్ టైమ్స్’ వారు పెట్టిన వీడియోని ఇక్కడ చూడవొచ్చు.
చివరగా, వార్తాపత్రికల ద్వారా కొరోనా వైరస్ వ్యాప్తి జరిగే అవకాశాలు చాలా తక్కువ.
‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?