Fake News, Telugu
 

కర్ణాటకలో అంతకుముందు ఉన్న BJP ప్రభుత్వం కూడా అవిముక్తేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల పర్యవేక్షణ కమిటీలో ముస్లింలను నియమించింది

0

కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం బెంగళూరు రూరల్ ప్రాంతంలోని హాస్కోట్ అవిముక్తేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల పర్యవేక్షణ కమిటీలో ఒక హిందూయేతరుడైన నవాజ్ అనే ముస్లిం వ్యక్తిని నియమించింది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. తమ వాదనకు మద్దతుగా ఒక గవర్నమెంట్ సర్కులర్‌ను కూడా షేర్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ ఆచారాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని చెప్పే క్రమంలో ఈ వార్తను షేర్ చేస్తున్నారు (ఇక్కడ & ఇక్కడ). ఈ కథనం ద్వారా ఆ వార్తకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: హిందూ సాంప్రదాయాలకు వ్యతిరేకంగా కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం హాస్కోట్ అవిముక్తేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల పర్యవేక్షణ కమిటీలో ఒక ముస్లిం వ్యక్తిని నియమించింది.

ఫాక్ట్(నిజం): కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం అవిముక్తేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల పర్యవేక్షణ కమిటీలో ముస్లిం వ్యక్తిని నియమించిన విషయం నిజమే అయినప్పటికీ, గతంలోని BJP ప్రభుత్వం కూడా ఇలా ముస్లిం వ్యక్తులను నియమించింది. అప్పటి BJP ప్రభుత్వం 2020-21 కమిటీలో ముస్లిం వ్యక్తులను నియమించిన సర్కులర్‌ను ప్రభుత్వం షేర్ చేసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది

ప్రస్తుతం వైరల్ అవుతున్న పోస్టులో చెప్తున్నట్టు నిజంగానే కర్ణాటక ప్రభుత్వం అవిముక్తేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల పర్యవేక్షణ కమిటీలో ఒక ముస్లిం వ్యక్తికి చోటు కల్పించింది. ఐతే ఇలా జరగడం మొదటిసారి కాదు, గతంలోని ప్రభుత్వం కూడా ఇలా ఆలయ కమిటీలో ముస్లిం వ్యక్తులను నియమించింది.

ఈ వార్తకు సంబంధించి మరింత సమాచారం వెతకగా ఈ వార్తకు సంబంధించిన కథనాలు దొరికాయి. ఈ కథనాల ప్రకారం ఆలయ కమిటీలో ఒక ముస్లిం వ్యక్తిని నియమించడం రాజకీయంగా వివాదాస్పదం కావడంతో ప్రభుత్వం ఈ విషయంపై స్పందించింది (ఇక్కడ). ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఇతర మంత్రులు వివరణ ఇస్తూ గత BJP ప్రభుత్వం కూడా బ్రహ్మోత్సవాల పర్యవేక్షణ కమిటీలో ముస్లిం వ్యక్తులను నియమించిందని తెలిపింది. 2020-21 కమిటీలో ముస్లిం వ్యక్తులను నియమించిందని చెప్తూ, దానికి సంబంధించిన సర్కులర్‌ను షేర్ చేసారు.

అంతకుముందు కర్ణాటక BJP ముస్లిం వ్యక్తిని నియమయించి ప్రభుత్వం హిందూ సాంప్రదాయాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది అంటూ ఆరోపించింది. ఇదే విషయాన్ని తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపింది. ఐతే గత BJP ప్రభుత్వం కూడా ఇలా చేసిందని వివరణ ఇచ్చిన అనంతరం BJP తమ ట్వీట్‌ను తొలగించింది.

చివరగా, కర్ణాటకలో అంతకుముందు ఉన్న BJP ప్రభుత్వం కూడా అవిముక్తేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల పర్యవేక్షణ కమిటీలో ముస్లింలను నియమించింది.

Share.

About Author

Comments are closed.

scroll