Fake News, Telugu
 

ఈ ఫోటోల్లో బుర్కా లేకుండా ఉన్నది ముస్కాన్ ఖాన్ కాదు; తను జేడీ(ఎస్) సభ్యురాలు నజ్మా నజీర్

0

కర్ణాటకలో జరుగుతున్న హిజాబ్ ఘటనల్లో భాగంగా సోషల్ మీడియాలో చాలా మంది కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ, అందులో బుర్కా లేకుండా ఉన్నది ముస్కాన్ ఖాన్ అని రాస్తున్నారు. తాజగా కర్ణాటకలో కొందరు వ్యక్తులు ‘జై శ్రీ రామ్’ అని ముస్కాన్ ముందు నినాదాలు చేయగా, వారికి బదులిస్తూ తను ‘అల్లా హు అక్బర్’ అన్న వీడియో చాలా వైరల్ అయింది. ఆ నేపథ్యంలో ఈ ఫోటోలను షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: స్కూల్ దగ్గర బుర్కాలో, వేరే చోట్ల బుర్కా లేకుండా ముస్కాన్ ఖాన్ ఉన్నట్టు ఫోటోల్లో చూడవచ్చు.

ఫాక్ట్: పోస్ట్ చేసిన ఫోటోల్లో బుర్కా లేకుండా ఉన్న మహిళ ముస్కాన్ ఖాన్ కాదు. ఫోటోల్లో బుర్కా వేసుకొని ఉన్నది ముస్కాన్ ఖాన్; కానీ, బుర్కా లేకుండా ఉన్నది జేడీఎస్ పార్టీ (కర్ణాటక) సభ్యురాలు నజ్మా నజీర్. అంతేకాదు, పోస్ట్‌లోని ఫోటోల్లో ఒక ఫోటో ఎడిట్ చేయబడినది. కావున పోస్ట్‌లో చెప్పింది తప్పు.

పోస్ట్‌లోని ఫోటోల్లో బుర్కా లేకుండా ఉన్న మహిళ గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, తన పేరు నజ్మా నజీర్ అని తెలిసింది. పోస్ట్‌లోని కొన్ని ఫోటోలు తన సోషల్ మీడియా అకౌంట్‌లో కూడా చూడవచ్చు. తను కర్ణాటకలోని జేడీ(ఎస్) పార్టీ సభ్యురాలు. తనకు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు. 

అంతేకాదు, పోస్ట్‌లోని ఫోటోల్లో ఒక ఫోటో ఎడిట్ చేయబడినది. దానికి సంబంధించిన ఒరిజినల్ ఫోటోని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

ఫోటోల్లో బుర్కా వేసుకొని ఉన్నది ముస్కాన్ ఖాన్. తన గురించి మరింత సమాచారం ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చదవచ్చు.

చివరగా, ఫోటోల్లో బుర్కా లేకుండా ఉన్నది ముస్కాన్ ఖాన్ కాదు; తను జేడీ(ఎస్) లీడర్ నజ్మా నజీర్.

Share.

About Author

Comments are closed.

scroll