Fake News, Telugu
 

పార్లమెంటు భద్రతా ఉల్లంఘన కేసులో నిందితుడు మనోరంజన్‌ ఫోటో అంటూ SFI నేత విజయ్‌ కుమార్‌ చిత్రాన్ని షేర్ చేస్తున్నారు

0

ఇటీవల పార్లమెంటులో సమావేశాలు జరుగుతుండగా కొందరు వ్యక్తులు స్మోక్ బాంబ్‌లను ఉపయోగించిన ఘటన గురించి తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో, ఒక ఫోటో షేర్ చేస్తూ ఆ ఫోటోలో మాట్లాడుతున్న వ్యక్తి SFI కార్యకర్త మనోరంజన్ అని, అతను పార్లమెంటులో స్మోక్ బాంబ్ వేసిన వ్యక్తి అని రాస్తున్నారు. దీని వెనుక ఉన్న వాస్తవం ఏంటో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: ఫోటోలో మాట్లాడుతున్న వ్యక్తి ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో స్మోక్ బాంబ్ వేసిన SFI కార్యకర్త మనోరంజన్.

ఫాక్ట్(నిజం): ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి SFI మైసూర్ జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్. వైరల్ పోస్టులో షేర్ చేసిన చిత్రాన్ని 8 సెప్టెంబర్ 2022న SFI మైసూర్ ఫేస్బుక్ పేజీలో, మైసూర్‌లో జరిగిన SFI రెండవ కాన్ఫరెన్స్ సందర్భంగా పోస్టు చేయబడింది. కావున పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

ఈ క్లెయిమ్ గురించి కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికితే, SFI కర్ణాటక ఫేస్బుక్ పేజీలో ఇదే ఫోటో లభించింది. ఈ సంస్థ పోస్టు చేస్తూ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి SFI మైసూర్ జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్ అని, ఈ కేసులో విజయ్ కుమార్ పేరును చాలా మంది తప్పుగా వాడారని పేర్కొన్నారు. పైగా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. SFI కర్ణాటక రాష్ట్ర కార్యదర్శి భీమనగౌడ సుంకేశ్వరహాల్ కూడా వైరల్ పోస్టును షేర్ చేస్తూ ఇది తప్పుడు క్లెయిమ్ అని తెలపటం గమనించాం

ఈ విషయం గురించి SFI మైసూర్ అనే ఫేస్బుక్ పేజీలో కూడా పోస్టు చేస్తూ దాడి చేసిన వారితో SFIకి ఎలాంటి సంబంధాలు లేవని మరియు ఈ చిత్రంలో ఉన్న వ్యక్తిని ‘TS విజయ్ కుమార్’ అని తెలిపారు.

ఈ పేజీని మరింత పరిశీలిస్తే, వైరల్ పోస్టులో షేర్ చేసిన చిత్రాన్ని 8 సెప్టెంబర్ 2022న అప్‌లోడ్ చేసినట్లు మేము కనుగొన్నాము. ఆ పోస్టు యొక్క టైటిల్  ప్రకారం, ఇది మైసూర్‌లో జరిగిన SFI రెండవ కాన్ఫరెన్స్ సందర్భంగా తీసినది అని కనుగొన్నాము.

A black text on a white background  Description automatically generated

The Quint మీడియా సంస్థతో విజయ్ కుమార్ మాట్లాడుతూ, ఈ చిత్రంలో కనిపించేది తానే అని స్పష్టం చేశారు. అంతే కాకుండా ప్రజలు తనను మనోరంజన్ అని తప్పుగా గుర్తిస్తూ తన ఫోటోను వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ చేస్తున్నారని అందుకు తప్పుడు క్లెయిమ్‌తో తన ఫోటోను షేర్ చేస్తున్న వారిపై ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.

మనోరంజన్ మరియు విజయ్ కుమార్ యొక్క చిత్రాలను పొలుస్తూ వారిద్దరూ వేర్వేరు వ్యక్తులని Quint సంస్థ హైలైట్ చేసింది.

మనోరంజన్, పార్లమెంటులోకి దూకిన రెండో వ్యక్తి. మనోరంజన్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అని, ప్రధాని నరేంద్ర మోదీ మాజీ అభిమాని అని అతని తండ్రి దేవరాజ్ గౌడ తెలిపినట్టు కొన్ని వార్తా సంస్థలు రిపోర్ట్ చేసాయి (ఇక్కడ మరియు ఇక్కడ).  

చివరిగా, పార్లమెంటు భద్రతా ఉల్లంఘన కేసులో నిందితుడు మనోరంజన్‌ ఫోటో అంటూ SFI నేత విజయ్‌ కుమార్‌ చిత్రాన్ని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll