Fake News, Telugu
 

2015 లో జరిగిన ఘటన ఫోటో పెట్టి, తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఎన్ కౌంటర్ ఫోటో అని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

1

హైదరాబాద్ లో ఈ రోజు ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ యొక్క దృశ్యాలు అంటూ ఒక ఫోటోని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. అదే ఫోటోని ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఛానల్ వారు కూడా హైదరాబాద్ ఎన్ కౌంటర్ కి సంబంధించిన స్టోరీ వీడియోలో ‘FIRST ON ABN’ అని చెప్తూ పెట్టారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: హైదరబాద్ ఎన్ కౌంటర్ లో చనిపోయిన నిందితుల యొక్క మృతిదేహాల ఫోటో.

ఫాక్ట్ (నిజం): వీడియోలోని ఫోటో హైదరాబాద్ ఎన్ కౌంటర్ కి సంబంధించిన ఫోటో కాదు. అది 2015 లో ఏపీ పోలీసులు ఎర్ర చందనపు చెట్లు కొడుతున్నారని కొందరిని ఎన్ కౌంటర్ చేసినప్పటిది. కావున 2015 లో జరిగిన ఘటన ఫోటో పెట్టి, తాజా ఎన్ కౌంటర్ ఫోటో అని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ వారు తమ యూట్యూబ్ ఛానల్ లో పెట్టిన వీడియోలో (ఆర్కైవ్డ్) ‘FIRST ON ABN’ అంటూ పెట్టిన ఫోటోని కింద స్క్రీన్ షాట్ లో చూడొచ్చు. ఆ ఫోటో గురించి వివరిస్తూ, ‘ఎన్ కౌంటర్ జరిగిన చోట నిందితుల మృతిదేహాలు’ అని రాసినట్టు వీడియోలో చూడొచ్చు.

ఆ ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అదే ఫోటో ‘The Hindu’ వారు 2015 లో ప్రచురించిన ఆర్టికల్ లో లభిస్తుంది. ఆ ఆర్టికల్ లో ఆ ఫోటో చిత్తూరు లో జరిగిన ఎన్ కౌంటర్ కి సంబంధించిన ఫోటో అని రాసి ఉంటుంది. ఎర్ర చందనం చెట్లు కొడుతున్న కొంత మందిని ఏపీ పోలీసులు కాల్చారని ఆ ఆర్టికల్ లో ఉంటుంది. కావున, ఆ ఫోటో హైదరాబాద్ లో జరిగిన ఎన్ కౌంటర్ కి సంబంధించిన ఫోటో కాదు.  

చివరగా, 2015 లో జరిగిన ఎన్ కౌంటర్ ఫోటో పెట్టి, హైదరాబాద్ లో తాజాగా జరిగిన ఎన్ కౌంటర్ కి సంబంధించిన ఫోటో గా షేర్ చేస్తున్నారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll