Fake News, Telugu
 

ఈ ఫోటోలలో ఉన్నది ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి కాదు

0

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిలకు సంబంధించి ఒక వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఫొటోలో ఉన్నది అసిస్టెంట్ కమిషనర్ శాంతి అంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). ఈ కథనం ద్వారా ఆ ఫోటోలకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి వివాదానికి సంబందించిన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఫోటో.

ఫాక్ట్(నిజం): ఈ ఫోటోలలో ఉన్నది వైకాపా కార్యకర్త, ఆంధ్రప్రదేశ్ అసిస్టెంట్ కమిషనర్ శాంతి కాదు. గతంలో ఈ కార్యకర్త విజయసాయిరెడ్డిని కలిసినప్పుడు ఈ ఫోటోలను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిలకు సంబంధించి ఒక వివాదం నడుస్తుంది. ఐతే ప్రస్తుతం షేర్ అవుతున్న ఫోటోలలో ఉన్నది అసిస్టెంట్ కమిషనర్‌ శాంతి కాదు. ఈ వివాదం నేపథ్యంలో అసిస్టెంట్ కమిషనర్ శాంతి మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చింది (ఇక్కడ & ఇక్కడ). ఈ రిపోర్ట్ చూస్తే ప్రస్తుతం షేర్ అవుతున్నది ఆమె ఫోటో కాదని స్పష్టమవుతుంది.

ఇదిలా ఉండగా ప్రస్తుతం షేర్ అవుతున్న ఫోటో కేసగారి మాధవి అనే వైకాపా కార్యకర్తది. ప్రస్తుతం షేర్ అవుతున్న ఫోటోలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ ఫోటోలను మాధవి తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసిన పోస్టులు కనిపించాయి (ఇక్కడ & ఇక్కడ). ఈమె ట్విట్టర్ ప్రొఫైల్‌లో వైకాపాకు అనుకూలమైన పోస్టులు ఉన్నాయి. గతంలో తాను విజయసాయిరెడ్డిని కలిసినప్పుడు ఈ ఫోటోలను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేసింది.

చివరగా, ఈ ఫోటోలలో ఉన్నది ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి కాదు.

Share.

About Author

Comments are closed.

scroll