Fake News, Telugu
 

ఈ వీడియోలో డాన్స్ చేస్తున్నది నరేంద్ర మోదీ తల్లి హీరాబీన్ మోదీ కాదు

0

‘మోదీ అమ్మ సూపర్ డాన్స్’, అంటూ షేర్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ ‘ABN ఆంధ్రజ్యోతి’, ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్:  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి గారు డాన్స్ చేస్తున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): వీడియోలో డాన్స్ చేస్తున్నది నరేంద్ర మోదీ తల్లి హీరాబీన్ మోదీ కాదు. నరేంద్ర మోదీ తల్లి గారు డాన్స్ చేస్తున్న వీడియో, అంటూ ఈ వీడియోని షేర్ చేసిన పుదుచ్చేరి గవర్నర్ కిరణ్ బేడి, ఆ తరువాత వీడియోలో డాన్స్ చేస్తున్నది నరేంద్ర మోదీ తల్లి గారు కాదని స్పష్టం చేస్తూ ట్వీట్ పెట్టారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే వీడియోని షేర్ చేస్తూ పుదుచ్చేరి గవర్నర్ కిరణ్ బేడి పెట్టిన ట్వీట్ దొరికింది. కానీ, తన పోస్ట్ చేసిన వీడియోలో డాన్స్ చేస్తున్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి గారు కాదని స్పష్టతనిస్తూ కిరణ్ బేడి మళ్ళి ట్వీట్ పెట్టారు.

పుదుచ్చేరి గవర్నర్ కిరణ్ బేడి పెట్టిన ఈ ట్వీట్లకు సంబంధించి పలు న్యూస్ వెబ్ సైట్ ఆర్టికల్స్ పబ్లిష్ చేసాయి. ఆ ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. వీడియోలో డాన్స్ చేస్తున్న ముసలావిడ ఎవరన్నది తెలుసుకోలేనప్పటికి, డాన్స్ చేస్తున్నది నరేంద్ర మోదీ తల్లి గారు కాదని ఈ వివరాల ఆధారంగా ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, సంబంధం లేని వీడియోని చూపిస్తూ నరేంద్ర మోదీ తల్లి హీరాబీన్ మోదీ డాన్స్ చేస్తున్న వీడియో అని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll