పోస్ట్ చేసిన ఫోటోలో ఉన్నది ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జస్టిస్ వి. కనగరాజ్ అని, తను ఒక పాస్టర్ అని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

క్లెయిమ్: ఫోటోలో పాస్టర్ గా ఉన్నది ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జస్టిస్ వి. కనగరాజ్.
ఫాక్ట్ (నిజం): ఫోటోలో ఉన్నది ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జస్టిస్ వి. కనగరాజ్ కాదు. జస్టిస్ వి. కనగరాజ్ పాస్టర్ కాదు. ఫోటోలో ఉన్న పాస్టర్ పేరు ‘Rt. Rev. S. Edwin Jayakumar’. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్ట్ లోని ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, ఫోటోలో ఉన్నది ‘telc bishop edwin jayakumar’ అని వస్తుంది. ఎడ్విన్ జయకుమార్ యొక్క ఇతర ఫోటోలతో ఫోటోలోని వ్యక్తి పోల్చి చూడగా, ఫోటోలో ఉన్నాది ‘Rt. Rev. S. Edwin Jayakumar’ అని కచ్చితంగా తెలుస్తుంది. ఎడ్విన్ జయకుమార్ యొక్క ఇతర ఫోటోలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు.

అంతేకాదు, జస్టిస్ వి.కనగరాజ్‌పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లిందని, ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేయనున్నారని న్యూస్ ఆర్టికల్స్ చదవొచ్చు.

చివరగా, ఫోటోలో పాస్టర్ గా కనిపిస్తున్నది ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జస్టిస్ వి. కనగరాజ్ కాదు.
‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?
1 Comment
Pingback: ఫోటోలో పాస్టర్ గా కనిపిస్తున్నది ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జస్టిస్ కనగరాజ