Fake News, Telugu
 

ఫోటోలో రైతు నిరసనల్లో పాల్గొన్నట్టు కనిపిస్తున్నది ‘పాకిస్తాన్ జిందాబాద్’ అని అన్న అమూల్య లియోనా కాదు.

0

గత సంవత్సరం సీఏఏ (పౌరసత్వ సవరణ చట్టం) చట్టానికి వ్యతిరేఖంగా నిర్వహించిన ఒక మీటింగ్ లో ‘పాకిస్తాన్ జిందాబాద్’ అన్న మహిళ ఇప్పుడు నూతన రైతు చట్టాలకి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న నిరసనల్లో పాల్గొంది అని చెప్తూ, రెండు ఫోటోలతో కూడిన పోస్ట్ ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: సీఏఏ నిరసన మీటింగ్ లో ‘పాకిస్తాన్ జిందాబాద్’ అన్న మహిళ ఇప్పుడు రైతుల నిరసనల్లో పాల్గొందని ఫోటోల్లో చూడవొచ్చు.

ఫాక్ట్: మొదటి ఫోటోలో ఉన్నది అమూల్య లియోనా; తను బెంగళూరు లో సీఏఏ కి నిరసనగా నిర్వహించిన ఒక మీటింగ్ లో ‘పాకిస్తాన్ జిందాబాద్’ అని అన్నది. కానీ, రెండవ ఫోటోలో రైతు నిరసనల్లో పాల్గొన్నట్టు కనిపిస్తున్నది అమూల్య లియోనా కాదు; ఆ ఫోటోలో సర్కిల్ చేయబడి ఉన్నది తమిళనాడు కి చెందిన స్టూడెంట్ యాక్టివిస్ట్ వలర్మతి. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లో రెండు ఫోటోలు ఉన్నాయి. ఒక్కో ఫోటో గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం.

ఫోటో 1:

ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అదే ఫోటోతో 2020 లో ప్రచురించిన చాలా న్యూస్ ఆర్టికల్స్ సెర్చ్ రిజల్ట్స్ లో వస్తాయి. ఆ ఫోటోలో ఉన్నది అమూల్య లియోనా అని, తను బెంగళూరు లో సీఏఏ కి నిరసనగా నిర్వహించిన ఒక మీటింగ్ లో ‘పాకిస్తాన్ జిందాబాద్’ అని అన్నట్టు ‘బీబీసీ న్యూస్’ వారి ఆర్టికల్ లో చదవొచ్చు. ఆ ఘటన కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చదవొచ్చు.

ఫోటో 2:

రెండవ ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, ఆ ఫోటో గురించి ఖచ్చితమైన సమాచారం ఏమీ కూడా సెర్చ్’ రిజల్ట్స్ లో రాలేదు. అయితే, ఒకరు పోస్ట్ లో పెట్టినట్టు రెండు ఫోటోలతో తమిళ్ లో ట్వీట్ చేయగా, ఆ ట్వీట్ కింద కామెంట్స్ లో ఒకరు రెండవ ఫోటోలో సర్కిల్ చేయబడి ఉన్నది తమిళనాడు కి చెందిన వలర్మతి అని చెప్పారు.

వలర్మతి గురించి వెతకగా, తను తమిళనాడు కి చెందిన స్టూడెంట్ యాక్టివిస్ట్ అని తెలిసింది. తన ఫేస్బుక్ ప్రొఫైల్ లో వెతకగా, పోస్ట్ లోని ఫోటోని తను కూడా 26 జనవరి 2021 న షేర్ చేసినట్టు తెలిసింది.

తను రైతు నిరసనల్లో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లినట్టు తన ప్రొఫైల్ లో పెట్టిన వీడియోలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు.

చివరగా, ఫోటోలో రైతు నిరసనల్లో పాల్గొన్నట్టు కనిపిస్తున్నది ‘పాకిస్తాన్ జిందాబాద్’ అన్న అమూల్య లియోనా కాదు. తను తమిళనాడు స్టూడెంట్ యాక్టివిస్ట్ వలర్మతి.

Share.

About Author

Comments are closed.

scroll