Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

జైపూర్ లో ఒక సాధువుకి కొరోనావైరస్ వచ్చిందని, దాంతో 300 మంది సాధువులను క్వారంటైన్ కి పంపారనేది ఫేక్ వార్త

0

జైపూర్ లో ఒక సాధువుకి కొరోనావైరస్ వచ్చిందని, దాంతో 300 మంది సాధువులను మరియు 700 మంది పౌరులను క్వారంటైన్ కి పంపారనే వార్త సోషల్ మీడియా లో షేర్ అవుతోంది. కానీ, FACTLY విశ్లేషణ లో ఆ వార్త ఫేక్ అని తేలింది. అలాంటి వార్తనే ఒకటి రాజస్తాన్ లో వైరల్ అవ్వగా, అది ఒక ఫేక్ వార్త అని పీఐబీ (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) రాజస్తాన్ ట్వీట్ ద్వారా స్పష్టం చేసింది. అటువంటి ఘటన ఏదీ కూడా జరగలేదని జైపూర్ జిల్లా కలెక్టర్ తెలిపినట్టు ఆ ట్వీట్ లో చదవొచ్చు.

సోర్సెస్:
క్లెయిమ్: ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్:
1. పీఐబీ రాజస్తాన్ ట్వీట్ – https://twitter.com/PIBJaipur/status/1255094359453769728

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll