ఢిల్లీలో జరిగిన ‘నిర్భయ’ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన మైనర్ నిందుతుడి ఫోటో అని క్లెయిమ్ చేస్తూ ఒక పోస్ట్ సోషల్ మీడియా లో ప్రచారం కాబడుతుంది. ఆ పోస్ట్ లోని క్లెయిమ్ లో ఎంతవరకు నిజం అనేది కనుక్కుందాం.
క్లెయిమ్: 2012 ‘నిర్భయ’ గ్యాంగ్-రేప్, హత్య కేసులో అరెస్ట్ కాబడ్డ మైనర్ నిందితుడి ఫోటో.
ఫాక్ట్ (నిజం): ఫోటోలో ఉన్న అతని పేరు వినయ్ శర్మ, నిర్భయ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన అడల్ట్ నిందితుల్లో ఇతను ఒకడు. ఆ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన మైనర్ నేరస్థుడు ఇతను కాదు. కావున, పోస్ట్ లోని క్లెయిమ్ తప్పుదోవ పట్టించేదిలా ఉంది.
పోస్ట్ లోని ఫోటోలో ఉన్న అతని ముఖాన్ని క్రాప్ చేసి గూగుల్ రివర్స్ ఇమేజ్ టెక్నిక్ ద్వారా వెతికితే, ‘Hindustan Times’ 2016లో ప్రచురించిన ఒక ఆర్టికల్ లో కనిపించింది. ఆ ఆర్టికల్ ప్రకారం, అతని పేరు వినయ్ శర్మ అని, 2012లో జరిగిన ‘నిర్భయ’ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన అడల్ట్ నిందితుల్లో ఇతను ఒకడు అని, ఆ కేసులో అరెస్టు కాబడిన జువనైల్ నేరస్తుడు ఇతడు కాదు అని తెలిసింది.
‘The Hindu’ వారు ప్రచురించిన ఒక ఆర్టికల్లో, ‘నిర్భయ’ కేసు లో పోలీసులు అరెస్ట్ చేసిన మైనర్ దోషిని 20 డిసెంబర్ 2015 న ఒక నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కి విడుదల చేసారని, అతన్ని అక్కడ నుండి ఉత్తర్ ప్రదేశ్ లోని తన ఊరికి తరలించి ఉండుంటారని సమాచారం లభించింది. ఈ మధ్యనే ‘India Today’ వారు రాసిన ఆర్టికల్ లో వినయ్ శర్మని 8 డిసెంబర్, 2019 న మండాలి జైలు నుండి తీహార్ జైలుకి తరలించారని తెలిసింది.
చివరగా, ఫొటోలో ఉన్నది ‘నిర్భయ’ కేసులో అరెస్ట్ అయిన మైనర్ నేరస్థుడిది కాదు, అతడు (వినయ్ శర్మ), అదే కేసులో అరెస్ట్ కాబడ్డ అడల్ట్ నిందితుల్లో ఒకడు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?
1 Comment
Pingback: ఈ ఫోటో ‘నిర్భయ’ కేసులో అరెస్ట్ అయిన మైనర్ నిందితుడిది కాదు, పోలీసులు అరెస్ట్ చేసిన అడల్ట్ నింద