Fake News, Telugu
 

ఒక మహిళ గొలుసును దొంగిలిచిన దొంగలను పోలీసులు తీసుకొచ్చి ఆమెకు క్షమాపణలు చెప్పించిన ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది

0

“ఉత్తర ప్రదేశ్ లో యోగీ జీ పాలన రామరాజ్యాన్ని తలపిస్తుంది…. తప్పు చేసిన వాడికి గంటల వ్యవధిలో గతం గుర్తొచ్చేలా చర్యలు ఉంటున్నాయి” అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియోలో ఒక మహిళ తన ఇంటి బయట ఊడుస్తుండగా, ఇద్దరు దొంగలు బండిపై వచ్చి ఆమె గొలుసును లాక్కొని వెళ్ళిపోవడం, తర్వాత  పోలీసులు ఆ ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, వారిని ఆ మహిళ వద్దకు తీసుకెళ్లి, ఆమెకు క్షమాపణ చెప్పించించి, గొలుసును తిరిగి ఇప్పించడం ఈ వీడియోలో మనం చూడవచ్చు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఉత్తరప్రదేశ్‌లో ఒక మహిళ గొలుసు దొంగిలించిన ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేసి, దొంగలను ఆమె వద్దకు తీసుకెళ్లి గొలుసును తిరిగి ఇస్తున్న దృశ్యాలు. 

ఫాక్ట్(నిజం): ఈ వీడియోలో చూపిస్తున్న సంఘటన ఉత్తరప్రదేశ్‌లో జరగలేదు. ఈ సంఘటన జూలై 2025లో మహారాష్ట్రలోని అకోలా నగరంలోని ఆనంద్ నగర్‌లో జరిగింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, ఈ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలను రిపోర్ట్ చేస్తూ జూలై 2025లో ప్రచురించబడిన మరాఠీ పలు వార్త కథనాలు (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) మాకు లభించాయి. ఈ కథనాలు ప్రకారం, ఈ సంఘటన మహారాష్ట్రలోని అకోలా నగరంలోని ఆనంద్ నగర్‌లో జరిగింది. ఒక మహిళ తన ఇంటి బయట ఊడుస్తుండగా, ఇద్దరు దొంగలు బండిపై వచ్చి ఆమె గొలుసును లాక్కొని వెళ్లిపోయారు. ఈ ఘటన మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డైంది, బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో, పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసి, దీపక్ పర్మార్, రాకేష్ పటానీ అనే నిందితులను గుజరాత్, నాగ్‌పూర్ నుంచి అరెస్ట్ చేశారు. దొంగిలించబడిన మంగళసూత్రాన్ని కూడా వారి నుండి స్వాధీనం చేసుకున్నారని వార్త కథనాలు పేర్కొన్నాయి.

చివరిగా, ఒక మహిళ గొలుసును దొంగిలిచిన దొంగలను పోలీసులు తీసుకొచ్చి ఆమెకు క్షమాపణలు చెప్పించిన ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.

Share.

About Author

Comments are closed.

scroll