Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

ఈ వీడియోలో బురఖా ధరించిన ముస్లిం మహిళకి రేషన్ కిట్ నిరాకరించబడలేదు

0

హిందూ ఫాసిస్ట్లు బురఖా వేసుకున్న మహిళ ముస్లిం అయినందుకు రేషన్ కిట్ నిరాకరించారంటూ ఒక వీడియో సోషల్ మీడియా లో ప్రచారం అవుతుంది. ఆ క్లెయిమ్ లో ఎంతవరకు  నిజం ఉందో విశ్లేషిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: బురఖా వేసుకున్న ఒక ముస్లిం మహిళ కి రేషన్ నిరాకరిస్తున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): వీడియోలో బురఖా వేసుకున్న మహిళకి రేషన్ కిట్ నిరాకరించబడలేదు. ఆ వీడియో లో ఫుడ్ కిట్ ని పంచుతున్న రాజీవ్ మిశ్రా ‘FACTLY’కి పంపించిన మరొక వీడియో మరియు ఫోటోలలో ఆ మహిళ కి రేషన్ ఇవ్వడం చూడవచ్చు. కావున, పోస్ట్ లోని క్లెయిమ్ తప్పు.

పోస్ట్ చేసిన వీడియో లో 25 సెకండ్స్ నిడివి దగ్గర రేషన్ పంచుతున్న అతని పేరు ‘రాజీవ్ మిశ్రా’ అని వినిపిస్తుంది. ఆయన పేరుని, కొన్ని కీలక పదాలను ఉపయోగించి వెతికితే, ఫేస్బుక్ లో ‘UPKhabar’ పోస్ట్ చేసిన ఒక  వీడియో ద్వారా అతని గురించి మరింత సమాచారం తెలిసింది.

ఆ సమాచారం ద్వారా ‘రాజీవ్ మిశ్రా’ (మమతా చారిటబుల్ ట్రస్ట్  ప్రెసిడెంట్ మరియు ఉత్తర్ ప్రదేశ్ యొక్క BJP జనరల్ సెక్రటరీ) యొక్క ఫేస్బుక్ ప్రొఫైల్ లభించింది. అతను అదే వీడియోని ఆయన తన ఫేస్బుక్ ప్రొఫైల్ లో 16 ఏప్రిల్ 2020 న పోస్ట్ చేసాడు. ఆ వీడియోలో కూడా బురఖా వేసుకున్న ఆ మహిళ  రేషన్ ని  తీసుకోవడానికి  వచ్చినప్పుడు వీడియో మరొక దృశ్యానికి మారుతుంది; దీని వలన ఆ వీడియో చూసినవారు ఆమెకి రేషన్ నిరాకరించబడిందని అనుకుంటారు. ఆ వీడియోపై వివరణ కోసం ‘FACTLY’ రాజీవ్ మిశ్రాను సంప్రదించినప్పుడు, అతను సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న కథనాన్ని ఖండించాడు. అంతేకాక, ఆ ఈవెంట్ లో తీసిన మరొక వీడియోని,  ఫోటోలను ‘FACTLY’ కి పంపించాడు, వాటి ద్వారా ఆ బురఖా వేసుకున్న మహిళ కి రేషన్ అందింది అని స్పష్టమవుతుంది.

తను మతం ఆధారంగా ప్రజలపై వివక్ష చూపనని రాజీవ్ మిశ్రా ‘FACTLY’ కి చెప్పారు. అంతేకాక, తను ముస్లింలకు ఫుడ్ కిట్లు పంపిణీ చేస్తున్న వీడియోలు మరియు ఫోటోలను ఫేస్ బుక్ ప్రొఫైల్ లో చూడవచ్చు అని పేర్కొన్నాడు.

చివరగా, ఆ వీడియోలో బురఖా ధరించిన ముస్లిం మహిళ కి రేషన్ కిట్ నిరాకరించబడలేదు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll