Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

వీడియోలోని యువకులు భోజనాన్ని తన్నింది దళితులు వంట చేసినందుకు కాదు

0

కొంతమంది యువకులు అరుస్తూ భోజనం ప్లేట్లు ఉన్న బెంచ్ ని కాలితో తన్నిన వీడియో ని చాలా మంది ఫేస్బుక్ లో పోస్టు చేసి, క్వారంటైన్ సెంటర్ లో దళితులు వంట చేసినందున తినమని, ఆ యువకులు భోజనాన్ని కాలితో తన్నారని దాని గురించి చెప్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: క్వారంటైన్ సెంటర్ లో దళితులు వంట చేసినందున తాము తినమని భోజనం ప్లేట్లు ఉన్న బెంచ్ ని తన్నిన యువకుల వీడియో. 

ఫాక్ట్ (నిజం): వీడియో బీహార్ లోని ఒక క్వారంటైన్ సెంటర్ లో జరిగిన ఘటనది. అందులోని యువకులు సామాజిక దూరం పాటించకుండా భోజనం వడ్డించమని వంట చేసిన వారిని కోరగా, వారు దానికి నిరాకరించడంతో ఆగ్రహంగా భోజనం ప్లేట్లు ఉన్న బెంచ్ ని తన్నారు. ఈ ఘటనలో దళిత కోణమేమీ లేదు. అయితే, క్వారంటైన్ సెంటర్ లో దళిత మహిళ వండిన భోజనాన్ని ఒక యువకుడు నిరాకరించిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని భుజౌలి ఖుర్ద్ గ్రామం లో జరిగింది. పోస్టు లోని వీడియోకీ, ఉత్తర్ ప్రదేశ్ ఘటన కి సంబంధం లేదు. కావున, పోస్టులో చెప్పింది తప్పు. 

పోస్టులోని వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు,  ‘Dainik Bhaskar’ కథనం సెర్చ్ రిజల్ట్స్ లో వచ్చింది. ఆ కథనం లో వీడియో లోని ఘటన బీహార్ లోని ఒక క్వారంటైన్ సెంటర్ లో జరిగిందని ఉంది. అందులోని యువకులు (వలసకారులు) సామాజిక దూరం పాటించకుండా  భోజనం వడ్డించమని వంట చేసిన వారిని కోరగా, వారు దానికి నిరాకరించడంతో ఆ యువకులు భోజనం ప్లేట్లు ఉన్న బెంచ్ ని తన్నారు. అదే విషయాన్ని ‘Jagran’ కథనం లో కూడా చదవవచ్చు.

ఆ ఘటన కి సంబంధించి FIR నమోదయినట్లుగా ‘ABP Bihar’ కథనం లో చూడవచ్చు. ఆ కథనంలో ఆహారం నాణ్యత గురించి కూడా ప్రస్తావించినట్టు చదవొచ్చు. ఏ న్యూస్ రిపోర్ట్ లో కూడా ఘటన లో దళిత కోణం ఉన్నట్లుగా ప్రస్తావించబడలేదు.

అయితే, పోస్టులో ఉన్న విషయం గురించి గూగుల్ లో వెతికినప్పుడు, అలాంటి ఘటన  ఉత్తర్ ప్రదేశ్ లోని భుజౌలి ఖుర్ద్గ్రామం లోని క్వారంటైన్ సెంటర్ లో జరిగిందని తెలిసింది. ఆ క్వారంటైన్ సెంటర్ లోని ఒక వ్యక్తి దళిత మహిళ వంట వండిందనే కారణంగా భోజనాన్ని నిరాకరించాడు. అందుకుగానూ స్థానిక పోలీసులు అతని పై కేసు నమోదు చేశారు. ఆ FIR కాపీ ని ఇక్కడ చూడవచ్చు.

చివరగా, వీడియోలోని యువకులు భోజనాన్ని తన్నింది దళితులు వంట చేసినందుకు కాదు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll