Fake News, Telugu
 

మహారాష్ట్రలోని ఆర్టీఓ ఆఫీస్‌లో ట్రయల్ రన్ లో భాగంగా డ్రైవర్ వీడియోలోని విన్యాసాలు చేయలేదు

0

మహారాష్ట్ర లోని ఆర్టీఓ ఆఫీస్‌లో ఆటో డ్రైవర్ ని ట్రయల్ రన్ వేయమంటే, ఆ డ్రైవర్ ఆటో తో విన్యాసాలు చేసినట్టు చెప్తూ, ఒక వీడియోని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: మహారాష్ట్ర లోని ఆర్టీఓ ఆఫీస్‌లో ట్రయల్ రన్ వేయమంటే, ఆటోతో విన్యాసాలు చేసిన డ్రైవర్ వీడియో.

ఫాక్ట్: పోస్ట్ లో చెప్పిన కథలో నిజం లేదు. రోడ్డు పక్కన ఒక గ్రౌండ్ లో విన్యాసాలు చేసినట్టు వీడియోలో చూడవొచ్చు. వీడియోకి సంబంధించి వార్తాసంస్థలు 2019లో ఆర్టికల్స్ ప్రచురించాయి. ఆ ఆటో డ్రైవర్ అదే బండితో అంతకముందు చేసిన విన్యాసాలకు సంబంధించిన వీడియోలను యూట్యూబ్ లో చూడవొచ్చు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అలాంటి వీడియోనే ‘ది టైమ్స్ అఫ్ ఇండియా’ వారు కూడా డిసెంబర్ 2019 లో పోస్ట్ చేసినట్టు తెలిసింది. అయితే, ‘ది టైమ్స్ అఫ్ ఇండియా’ వారు పెట్టిన వీడియోలో ఎక్కడా కూడా పోస్ట్ లో చెప్పిన కథ లేదు. రోడ్డు పక్కన ఒక గ్రౌండ్ లో విన్యాసాలు చేసినట్టు వీడియోలో చూడవొచ్చు. ఆ ఈవెంట్ కి సంబంధించిన ఫోటోలను ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవొచ్చు.

ఆ ఆటో డ్రైవర్ పేరు సంతోష్ జాదవ్ అని, తను సుమారు 15-20 ఏళ్ళగా విన్యాసాలు చేస్తున్నాడని ‘ANI’ వారి ఆర్టికల్ లో చదవొచ్చు. తను ఒక ఆటో వ్యాపారి అని, వీడియోలోని ఆటోని మాత్రం తన విన్యాసాలకు ఉపయోగిస్తుంటాడని ‘ANI’ వారితో సంతోష్ జాదవ్ తెలిపాడు.

అంతేకాదు, తన ఆటో నెంబర్ తో యూట్యూబ్ లో వెతకగా, 2017 మరియు 2018 లో తన విన్యాసాల పై పెట్టిన మరిన్ని వీడియోలు వచ్చాయి.

చివరగా, మహారాష్ట్ర లోని ఆర్టీఓ ఆఫీస్‌లో ట్రయల్ రన్ లో భాగంగా డ్రైవర్ వీడియోలోని విన్యాసాలు చేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll