Fake News, Telugu
 

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన-గ్రామీణ పథకం ద్వారా ఆధార్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరి ఖాతాకి 2,00,000 రూపాయలు రావు

1

‘ఆధార్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరి ఖాతాకి 2,00,000 రూపాయలు వస్తాయి’ అని చెప్తూ ఒక యూట్యూబ్ వీడియో లింక్ తో కూడిన పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. యూట్యూబ్ వీడియోలో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన-గ్రామీణ (పీఎంఏవై-జీ) పథకం కింద ఆ డబ్బులు వస్తాయని ఉంటుంది. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన-గ్రామీణ (పీఎంఏవై-జీ) పథకం ద్వారా ఆధార్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరి ఖాతాకి 2,00,000 రూపాయలు వస్తాయి.

ఫాక్ట్ (నిజం): పీఎంఏవై-జీ పథకం ద్వారా కేవలం ఇల్లు లేదా పక్కా ఇల్లు లేని వాళ్ళకే ఇల్లు కట్టుకోవడానికి 1,20,000 రూపాయలు ఇస్తారు. అంతేకాదు, ఆ డబ్బులు అందరికీ ఇవ్వరు, చాలా నిబంధనలు ఉంటాయి. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు

పోస్ట్ లో పెట్టిన లింక్ ఓపెన్ చేసి వీడియో చూస్తే, ఆ వీడియోలో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన-గ్రామీణ (పీఎంఏవై-జీ) పథకం కి అప్లై చేసిన వాళ్ళందరకి 1,20,000 రూపాయలు వస్తాయని ఉంటుంది. అంటే, టైటిల్ లో ఏమో ఆధార్ కార్డు ఉన్న అందరికి 2,00,000 రూపాయలు వస్తాయని పెట్టి, వీడియోలో మాత్రం అప్లై చేసుకున్న వాళ్ళకి 1,20,000 రూపాయలు వస్తాయని చెప్తాడు. కనీసం అప్లై చేసిన అందరికీ పీఎంఏవై-జీ పథకం ద్వారా 1,20,000 రూపాయలు వస్తాయో లేదో చూద్దాం.

నరేంద్ర మోడీ రెండవ సారి ప్రధాని అయ్యాక పీఎంఏవై-జీ పథకాన్ని మొదలు పెట్టినట్టు వీడియోలో ఉంటుంది. కానీ, పీఎంఏవై-జీ పథకం గురించి ప్రభుత్వం రిలీజ్ చేసిన డాక్యుమెంట్ లో చూడగా, ఈ పథకాన్ని 2016 లోనే ప్రభుత్వం ప్రారంభించినట్టు చదవొచ్చు.

పీఎంఏవై-జీ పథకం ద్వారా గ్రామాల్లో ఇల్లు లేదా పక్కా ఇల్లు లేని వాళ్ళకి 1,20,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుందని ఆ డాక్యుమెంట్ లో చూడవొచ్చు. కానీ, వీడియోలో చెప్పినట్టు ఆధార్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఈ పథకం వర్తించదు. ‘Socio Economic and Caste Census -2011’ ద్వారా అర్హులను సెలెక్ట్ చేసి, గ్రామ సభ ద్వారా వాళ్ళని వెరిఫై చేసి అప్పుడు మాత్రమే 1,20,000 రూపాయలను ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం ఇస్తుంది.

పీఎంఏవై-జీ పథకం ద్వారా డబ్బులు పొందాలంటే పక్కా ఇల్లు ఉండ కూడదు, ఫ్రిడ్జ్ ఉండకూడదు, బైక్ మరియు కార్ ఉండకూడదు లాంటి నిబంధనలు ఎన్నో ఉంటాయి. అన్ని నిబంధనలను డాక్యుమెంట్ లో చూడవొచ్చు.

పీఎంఏవై – అర్బన్ కి సంబంధించిన వివరాలను ఇక్కడ చూడవొచ్చు.

చివరగా, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన-గ్రామీణ (పీఎంఏవై-జీ) పథకం ద్వారా ఆధార్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరి ఖాతాకి 2,00,000 రూపాయలు రావు

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll