ఒక వీడియో సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ) వైరల్ అవుతోంది. దీనితో షేర్ చేస్తున్న వివరణ ప్రకారం, ఇందులో బీహార్ రాష్ట్రం మోతీహరిలో కిడ్నాప్ నిందితులను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసు టీమ్‌పై ముస్లిం గ్రామస్థులు దాడి చేశారని, ఈ దాడిలో ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయని చెబుతున్నారు.ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
క్లెయిమ్: మోతీహరి బీహార్‌లో కిడ్నాప్ నిందితులను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసు టీమ్‌పై ముస్లిం గ్రామస్థులు దాడి చేశారని చూపిస్తున్న వీడియో.
ఫాక్ట్(నిజం): ఈ ఘటన 30 అక్టోబర్ 2024న మోతీహరి బీహార్‌లో జరిగింది. పోలీసులు ఒక కేసులో కిడ్నాప్‌కు గురైన ఇద్దరు బాలికలను కనుగొన్నారు. నిందితుడు శంభు భగత్ కుమారుడిని అరెస్టు చేయడానికి వచ్చినప్పుడు, బాలుడి కుటుంబం, ఇతరులు వారిపై దాడి చేశారు. FIR కాపీ ప్రకారం, నిందితులు అందరూ హిందువులు, ఈ కేసుకు అలాంటి మతపరమైన కోణం లేదని స్పష్టం అయింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి వెతకగా, మాకు సంఘటనను వివరిస్తున్న మీడియా కథనాలు (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) లభించాయి. 30 అక్టోబర్ 2024న, మోతీహరి బీహార్‌లో ప్రేమకు సంబంధించిన ఒక కేసులో కిడ్నాప్‌కు గురైన ఇద్దరు బాలికలను పోలీసులు కనుగొన్నారు, నిందితుడు శంభు భగత్ కుమారుడిని అరెస్టు చేయడానికి వచ్చినప్పుడు ఈ సంఘటన జరిగింది. పోలీసులపై బాలుడి కుటుంబం, ఇరుగుపొరుగు వారు దాడి చేశారు. ఈ దాడిలో ఏఎస్ఐ సోనుకుమార్ తలకు గాయాలు కాగా, హోంగార్డు మున్నా పాశ్వాన్ తీవ్రంగా గాయపడడం జరిగింది అని మాకు తెలిసింది.
మా పరిశోధనలో, అదే కేసులో నిందితుడి అరెస్టుకు సంబంధించి మోతిహారి పోలీసుల ట్వీట్‌ను కూడా మేము కనుగొన్నాము.
మేము ఈ కేసుకు సంబంధించిన FIR కాపీని కనుగొన్నాము. దీని ప్రకారం నిందితులు అందరూ హిందువులు అని మాకు తెలిసింది, మరియు ఈ కేసుకు అలాంటి మతపరమైన కోణం లేదని స్పష్టం అయింది.
చివరిగా, మోతీహరి బీహార్‌లో కిడ్నాప్ నిందితులను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసు టీమ్‌పై గ్రామస్థులు దాడి చేసిన సంఘటనను తప్పుడు మతపరమైన కోణంతో షేర్ చేస్తున్నారు.