Fake News, Telugu
 

2017లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సంఘటను తప్పుడు లవ్ జిహాద్ కోణంతో షేర్ చేస్తున్నారు

0

ఒక అబ్బాయి ఇంకో అమ్మాయిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న స్క్రీన్ షాట్ ఒకటి పోస్టు చేస్తూ ఒక ముస్లిం యువతి తన హిందూ స్నేహితురాలిపై అత్యాచారం చెయ్యటానికి ఒక ముస్లిం యువకుడికి సహాయపడింది అంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీని వెనుక ఉన్న నిజమేంటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

ఆర్కైవ్ చేసిన పోస్టును ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: చిత్తూరు జిల్లాలో ఒక ముస్లిం యువతి తన హిందూ స్నేహితురాలిపై అత్యాచారం చెయ్యటానికి ఒక ముస్లిం యువకుడికి సహాయపడింది.

ఫాక్ట్ (నిజం): ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని ప్రకాశం జిల్లా కనిగిరిలో 2017లో చోటు చేసుకుంది. కార్తీక్ అనే యువకుడు బాధితురాలిని పిక్నిక్ అని చెప్పి ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లాడు. అతను తన స్నేహితులు సాయికుమార్, పవన్‌లను కూడా తీసుకెళ్లాడు. ఆ అమ్మాయి కూడా తనతో పాటు తన స్నేహితురాలిని తీసుకెళ్లింది. కార్తీక్, పవన్ ఈ సంఘటనను వీడియో షూట్ చేయగా, సాయి కుమార్ యువతిపై లైంగిక  వేధింపులకు పాల్పడ్డాడు. ఇది జరుగుతున్నప్పుడు ఆమె స్నేహితురాలు బాధితురాలికి సహాయం చేయడానికి ప్రయత్నించింది. దీని తర్వాత కనిగిరి పోలీసులు ఈ ఘటనకు పాల్పడిన ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.  ఈ ఘటనలో పాల్గొన్న అందరూ ఒకే మతానికి చెందిన వారు, ఈ ఘటన వెనుక ఎటువంటి మత కోణం లేదా లవ్ జిహాద్ కోణం లేదు. కావున ఈ పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

వైరల్ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూస్తే, ఈ సంఘటన యొక్క వీడియోను ప్రచురిస్తూ రాసిన పలు న్యూస్ రిపోర్టులకు దారి తీసింది (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ). ఈ కథనాల ద్వారా ఈ సంఘటన 2017లో ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుందని తెలుసుకున్నాం.


‘టైమ్స్ నౌ’ 27 సెప్టెంబర్ 2017న ఈ ఘటనను వివరరిస్తూ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలో ముగ్గురు అబ్బాయిలు ఓ బాలికపై లైంగిక దాడి చేసి దాన్ని చిత్రీకరించారని తెలిపింది. కార్తీక్ అనే యువకుడు బాధితురాలిని పిక్నిక్ అని చెప్పి ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లాడు. అతను తన స్నేహితులు సాయికుమార్, పవన్‌లను కూడా తీసుకెళ్లాడు. ఆ అమ్మాయి కూడా తనతో పాటు తన స్నేహితురాలిని తీసుకెళ్లింది. కార్తీక్, పవన్ ఈ సంఘటనను వీడియో షూట్ చేయగా, సాయి కుమార్ బాలికపై లైంగిక  వేధింపులకు పాల్పడ్డాడు. ఇది జరుగుతున్నప్పుడు ఆమె స్నేహితురాలు బాధితురాలికి సహాయం చేయడానికి ప్రయత్నించింది. ఈ ఘటనను ఫోనులో చిత్రీకరించిన వీడియోను  సోషల్ మీడియాలో ప్రసారం చేశారు. బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో కనిగిరి పోలీసులు ఈ ఘటనకు పాల్పడిన ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.

అయితే ఈ మీడియా కథనాల్లో ఎక్కడా కూడా వేధింపులకు గురైన యువతి యొక్క ముస్లిం స్నేహితురాలి గురించి కానీ, ఈ ముగ్గురు నిందుతులు ముస్లిం యువకులు అని కానీ పేర్కొనలేదు. దీని గురించి మరింత తెలుసుకోవడానికి ఈ కేసు వివరాలను వెతకగా, ఈ ఘటనలో పాల్గొన్న అందరూ ఒకే మతానికి చెందిన వారు అని, ఈ ఘటన వెనుక ఎటువంటి వర్గాల కోణం లేదా లవ్ జిహాద్ కోణం లేదని తెలిసింది. ఈ కేసులు సంబంధించిన వివరాలు ఇక్క​​డ చూడవచ్చు.

చివరిగా, 2017లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సంఘటను తప్పుడు లవ్ జిహాద్ కోణంతో షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll