Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

జులై 1 నుంచి స్కూల్స్ ప్రారంభం ఆని చెప్తూ తెలంగాణ పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలను విడుదల చేయలేదు

0

తెలంగాణలో జులై 1 నుంచి స్కూల్స్ ప్రారంభం. మార్గదర్శకాలను విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ’ అని ఉన్న ఒక వార్తని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: తెలంగాణలో జులై 1 నుంచి స్కూల్స్ ప్రారంభం. మార్గదర్శకాలను విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ. 

ఫాక్ట్ (నిజం): తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఆ మార్గదర్శకాలు విడుదల చేసినట్టుగా ఎక్కడా కూడా అధికారిక సమాచారం లేదు. కేంద్ర హోం శాఖ తాజాగా విడుదల చేసిన ఆర్డర్ లో కూడా విద్యా సంస్థలను తిరిగి ప్రారంభించడంపై జూలై నెలలో నిర్ణయం తీసుకోబడుతుందని అని ఉంది. ‘టైమ్స్ అఫ్ ఇండియా’ వారితో మాట్లాడుతూ తాము అటువంటి మార్గదర్శకాలు విడుదల చేయలేదని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు. 

పోస్టులోని వార్తను చాలా వార్తా సంస్థలు [‘ఆసియానెట్ న్యూస్ తెలుగు’ (ఆర్కైవ్డ్), టీవీ9 (ఆర్కైవ్డ్), 10టీవీ (ఆర్కైవ్డ్) మరియు టైమ్స్ అఫ్ ఇండియా – సమయం (ఆర్కైవ్డ్)] ప్రచురించినట్టుగా చూడవొచ్చు.

ఆ వార్తల్లో ఇచ్చిన మార్గదర్శకాల గురించి ఇంటర్నెట్ లో వెతకగా, తెలంగాణ ప్రభుత్వం ఆ మార్గదర్శకాలు విడుదల చేసినట్టుగా ఎక్కడా కూడా అధికారిక సమాచారం లేదు. 30 జూన్ 2020 వరకు లాక్ డౌన్ ని పొడిగిస్తూ తాజాగా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఆర్డర్ లో ఎక్కడా కూడా విద్యాసంస్థల ప్రస్తావన కానీ, వాటిని ప్రారంభించడానికి  మార్గదర్శకాలు కానీ ఇవ్వలేదు. 30 మే 2020 న కేంద్ర హోం శాఖ విడుదల చేసిన ఆర్డర్ లో కూడా విద్యా సంస్థలను తిరిగి ప్రారంభించడంపై జూలై నెలలో నిర్ణయం తీసుకోబడుతుందని రాసి ఉన్నట్టు చదవొచ్చు.

అంతేకాదు, ‘టైమ్స్ అఫ్ ఇండియా’ వారితో మాట్లాడుతూ తాము అటువంటి మార్గదర్శకాలు విడుదల చేయలేదని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. ‘టైమ్స్ అఫ్ ఇండియా’ వారి ట్వీట్ ని ‘పీఐబీ ఇన్ తెలంగాణ’ వారు కూడా ట్వీట్ చేసినట్టుగా చూడవొచ్చు

చివరగా, జులై 1 నుంచి స్కూల్స్ ప్రారంభం ఆని చెప్తూ తెలంగాణ పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలను విడుదల చేయలేదు.

వివరణ (JUNE 02, 2020):
తెలంగాణలో జులై 1 నుంచి స్కూల్స్ ప్రారంభం అనే వార్తను పలు మీడియా సంస్థలు ప్రచురించిన నేపథ్యంలో, స్కూల్స్ ప్రారంభం గురించి ఎలాంటి మార్గదర్శకాలివ్వలేదు అని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ తెలిపారు. జూలై ఒకటి నుంచి ఉన్నత పాఠశాలలు, ఆగస్టు 1 నుంచి ప్రాథమిక పాఠశాలలు ప్రారంభమవుతాయని మీడియాలో వచ్చిన వార్తలను చిత్రారామచంద్రన్‌ ఖండించారు. ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని పేర్కొన్నారు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll