తెలంగాణ సీఎం కేసీఆర్, అత్యంత ప్రజాదరణ పొందిన సీఎంగా స్థానం సంపాదించినట్లు క్లెయిమ్ చేస్తూ ఒక ఇన్ఫోగ్రాఫిక్ ని సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు. ఆ క్లెయిమ్ లో ఎంతవరకు నిజం ఉందో విశ్లేషిద్దాం.
క్లెయిమ్: సర్వేలో అత్యంత పాపులర్ సీఎంగా మొదటి స్థానం పొందిన తెలంగాణ సీఎం కేసీఆర్.
ఫాక్ట్ (నిజం): పోస్ట్ లోని ఇన్ఫోగ్రాఫిక్ ని ఎడిట్ చేసారు. ఆ ఇన్ఫోగ్రాఫిక్ లో ఉన్న ర్యాంకింగ్స్ దేశం లోని ప్రతీ రాష్ట్రం నుండి 3000 మంది చెప్పిన దాని ఆధారంగా వివిధ రాష్ట్రాల సీఎంల పని తీరు ఫై CVoters నిర్వహించిన ‘స్టేట్ ఆఫ్ ది నేషన్ 2020: మే’ సర్వే కి సంబంధించింది. ఆ సర్వే లో తెలంగాణ సీఎం కేసీఆర్ అత్యంత పాపులర్ సీఎంగా స్థానం పొందలేదు. కావున, ఆ క్లెయిమ్ తప్పు.
పోస్టు లోని ఇన్ఫోగ్రాఫిక్ ని గూగుల్ రివర్స్ ఇమేజ్ టెక్నిక్ ద్వారా వెతికితే ఒక శివ సేన నాయకురాలు పెట్టిన ట్వీట్ లో అదే ఇన్ఫోగ్రాఫిక్ కనిపించింది. కానీ, ఆ ఇన్ఫోగ్రాఫిక్ లో ఒడిశా సీఎం అత్యంత పాపులర్ సీఎం గా ఉన్నారు. అంతేకాక, సీఎం కేసీఆర్ అసలు ఆ ఇన్ఫోగ్రాఫిక్ లోనే లేరని చూడవచ్చు. CVoter సర్వే ప్రకారం ఆ ర్యాంకింగ్స్ ఉన్నాయని ఆమె తన ట్వీట్ లో పేర్కొన్నారు. అంతేకాక, ఆ ఇన్ఫోగ్రాఫిక్ కింద అది తయారు చేసింది ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ అని ఉంది. దాని ప్రకారం, కొన్ని పదాలను ఉపయోగించి వెతికితే, ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ వారి కథనం కనిపించింది. ఆ కథనం లో, ప్రజలలో తక్కువ పాపులర్ అయిన సీఎంలలో కేసీఆర్ ఉండడం చూడవచ్చు. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం ప్రకారం, దేశంలో ఉన్న ప్రతీ రాష్ట్రం మరియు కేంద్ర పాలిత ప్రాంతం నుండి 3,000 మందికి పైగా చెప్పిన దాని ఆధారంగా ‘స్టేట్ ఆఫ్ ది నేషన్ 2020: మే’ సర్వే నిర్వహించారని తెలిసింది.
ఆ ర్యాంకింగ్స్ యొక్క పూర్తి లిస్ట్ ను ‘IANS’ వెబ్‌సైట్ లో చూడవచ్చు. ఆ లిస్ట్ లోని ర్యాంకింగ్స్ లో తెలంగాణ (సిఎం కేసీఆర్) 16వ స్థానంలో ఉండడం చూడవచ్చు
వివిధ రాష్ట్రాల్లో ముఖ్య మంత్రులు ఎలా పని చేస్తున్నారని వివిధ సంస్థలు తరచూ నిర్వహిస్తున్న అనేక సర్వేలలో పైన పేర్కొన్న సర్వే ఒకటి. అంతకముందు జరిపిన ఇతర సర్వేల యొక్క కొన్ని రిజల్ట్స్ ని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. అందులోని కొన్ని సర్వేలలో తెలంగాణ సీఎం కేసీఆర్ అత్యంత పాపులర్ సీఎం అని గుర్తింపబడ్డారు.
చివరగా, ఒక ఎడిట్ చేసిన ఇన్ఫోగ్రాఫిక్ ని పెట్టి CVoters వారి ‘స్టేట్ ఆఫ్ ది నేషన్ 2020: మే’ సర్వే ప్రకారం తెలంగాణ సీఎం, కేసీఆర్ అత్యంత పాపులర్ సీఎంగా గుర్తింపబడ్డారని ప్రచారం చేస్తున్నారు.
‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?