Fake News, Telugu
 

ప్రపంచంలోని ధనవంతుల్లో కాంగ్రెస్ లీడర్ సోనియా గాంధీ నాల్గవ స్థానంలో లేదు

0

ప్రపంచంలోని ధనవంతుల్లో కాంగ్రెస్ లీడర్ సోనియా గాంధీ నాల్గవ స్థానంలో ఉందని చెప్తున్న పోస్ట్ ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ప్రపంచంలోని ధనవంతుల్లో కాంగ్రెస్ లీడర్ సోనియా గాంధీ నాల్గవ స్థానంలో ఉంది.

ఫాక్ట్: ‘ఫోర్బ్స్‌’ సంస్థ తాజాగా రిలీజ్ చేసిన ప్రపంచ బిలియనీర్ల లిస్టులో సోనియా గాంధీ పేరు లేదు. 2,095 మంది పేర్లు ఉన్న ఆ లిస్టులో అసలు తన పేరు లేదు. ‘బిజినెస్ ఇన్సైడర్’ వారు రిలీజ్ చేసిన ‘Top 10 richest women in India’ లిస్టులో కూడా సోనియా గాంధీ లేదు. 2019 ఎన్నికల అఫిడవిట్ లో తన ఆస్తుల విలువ సుమారు 12 కోట్ల రూపాయలని సోనియా గాంధీ తెలిపింది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

2020 సంవత్సరానికి ‘ఫోర్బ్స్‌’ సంస్థ రిలీజ్ చేసిన ప్రపంచ బిలియనీర్ల లిస్టులో సోనియా గాంధీ పేరు ఉందా అని వెతకగా, ఆ లిస్టులో తను లేదని తెలిసింది. 2,095 మంది పేర్లు ఉన్న ఆ లిస్టులో అసలు తన పేరు లేదు. ఇండియా కి సంబంధించి ముఖేష్ అంబానీ అత్యుత్తమంగా 21 వ స్థానంలో ఉన్నాడు. బిలియనీర్ల కి సంబంధించిన రియల్-టైమ్ లిస్టుని ఇక్కడ చూడవొచ్చు.

‘బిజినెస్ ఇన్సైడర్’ వారు రిలీజ్ చేసిన ‘Top 10 richest women in India’ లిస్టులో కూడా సోనియా గాంధీ లేదు. 2019 ఎన్నికల అఫిడవిట్ లో తన ఆస్తుల విలువ సుమారు 12 కోట్ల రూపాయలని సోనియా గాంధీ తెలిపింది.

ప్రపంచంలోని ధనవంతుల్లో కాంగ్రెస్ లీడర్ సోనియా గాంధీ ఒకరని చెప్తూ, ‘బిజినెస్ ఇన్సైడర్’ (సోనియా – 4 వ స్థానం) మరియు ‘హఫింగ్టన్ పోస్ట్’ వారు ఒకప్పుడు ఆర్టికల్స్ ప్రచురించారు. అయితే, ‘బిజినెస్ ఇన్సైడర్’ వారు సోనియా కి సంబంధించిన డేటాను నమ్మదగని వెబ్సైటు నుండి తీసుకున్నారని 2018 లోనే ‘ఆల్ట్ న్యూస్’ వారు ఆర్టికల్ రాసారు. తమ లిస్టుని కొందరు ప్రశ్నించిన తర్వాత ‘హఫింగ్టన్ పోస్ట్’ వారు సోనియా గాంధీ పేరును లిస్టు నుండి తీసేసి, తాము సోనియా ఆస్తుల విలువని వెరిఫై చేయలేమని వివరణ ఇచ్చారు.

చివరగా, ప్రపంచంలోని ధనవంతుల్లో కాంగ్రెస్ లీడర్ సోనియా గాంధీ నాల్గవ స్థానంలో లేదు.

Share.

About Author

Comments are closed.

scroll