“మొదటి ఫొటోలో శివాజీ మహరాజ్, బాల్ ఠాక్రేల ఫొటోలు లేవు. శివసేన MLAల తిరుగుబాటు తరువాత నిన్న శివాజీ మహరాజ్, బాల్ ఠాక్రేలు గుర్తుకు వచ్చారు ఉద్ధవ్ ఠాక్రేకు”, అని చెప్తూ రెండు ఫోటోలతో ఉన్న ఒక పోస్ట్‌ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: తాజాగా శివసేన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన తరువాతనే ఆఫీసులో తన వెనకాల శివాజీ మరియు బాల్ ఠాక్రేల ఫోటోలను ఉద్ధవ్ ఠాక్రే పెట్టుకున్నాడు. అంతకముందు ఆ ఫోటోలు లేవు.
ఫాక్ట్: పోస్ట్‌లో చెప్పినట్టు కేవలం శివసేన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన తరువాతనే ఆఫీసులో తన వెనకాల శివాజీ విగ్రహాన్ని మరియు బాల్ ఠాక్రే ఫోటోను ఉద్ధవ్ ఠాక్రే పెట్టుకోలేదు. అంతకుముందు నుండే వాటిని ఆఫీసులో తన వెనకాల పెట్టుకున్నాడు. తను జనవరి 2022లో పోస్ట్ చేసిన వీడియోలో కూడా వాటిని చూడవచ్చు . కావున పోస్ట్‌లో చెప్పింది తప్పు.
పోస్ట్‌లోని రెండు ఫోటోల వివరాల గురించి తెలుసుకోవడానికి ఉద్ధవ్ ఠాక్రే ఫేస్బుక్ ప్రొఫైల్ చూడగా, ఆ రెండు ఫోటోలను తాను పోస్ట్ చేసిన వీడియోల నుండి తీసుకున్నట్టుగా తెలిసింది. మొదటి ఫోటోని ఏప్రిల్ 2021లో పోస్ట్ చేసిన వీడియో నుండి, రెండవ ఫోటోని తాజగా 22 జూన్ 2022న పోస్ట్ చేసిన వీడియో నుండి తీసుకున్నట్టు చూడవచ్చు.
అయితే, పోస్ట్‌లో చెప్పినట్టు కేవలం శివసేన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన తరువాతనే ఆఫీసులో తన వెనకాల శివాజీ విగ్రహాన్ని మరియు బాల్ ఠాక్రే ఫోటోను ఉద్ధవ్ ఠాక్రే పెట్టుకోలేదు. అంతకుముందు నుండే వాటిని ఆఫీసులో తన వెనకాల పెట్టుకున్నాడు. తను జనవరి 2022లో పోస్ట్ చేసిన వీడియోలో కూడా వాటిని చూడవచ్చు.
అంతేకాదు, 2020 మరియు 2021లో వివిధ సమయాల్లో తన వెనకాల ఇతర శివాజీ విగ్రహలు మరియు బాల్ ఠాక్రే ఫోటోలు పెట్టుకుని మాట్లాడినట్టు ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు.
చివరగా, శివసేన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయకముందే ఆఫీసులో తన వెనకాల శివాజీ విగ్రహాన్ని మరియు బాల్ ఠాక్రే ఫోటోను ఉద్ధవ్ ఠాక్రే పెట్టుకున్నాడు.