Fake News, Telugu
 

2018లో శృంగేరి మఠాన్ని దర్శించుకున్నప్పుడు, పీఠాధిపతి రాహుల్ గాంధీని ఆశీర్వదించడానికి నిరాకరించలేదు

0

శృంగేరి పీఠానికి చెందిన జగద్గురు శంకరాచార్య రాహుల్ గాంధీ, సిద్ధరామయ్యలను ఆశీర్వదించడానికి నిరాకరించారని చెప్తూ ఒక ఫోటోని షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. రాహుల్ గాంధీ, సిద్ధరామయ్యలు హిందూ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న తీరుకు మేము మీకు ఆశీర్వాదం అందించలేమని జగద్గురు సూటిగా చెప్పినట్టు పోస్టులో పేర్కొన్నారు. ఈ కథనం ద్వారా ఆ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: రాహుల్ గాంధీ, సిద్ధరామయ్యల హిందూ వ్యతిరేక తీరుకు శృంగేరి పీఠానికి చెందిన జగద్గురు శంకరాచార్య వారిని ఆశీర్వదించలేదు.

ఫాక్ట్ (నిజం): 2018లో రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య శృంగేరి పీఠాన్ని దర్శించునప్పుడు పీఠాధిపతి వారిని ఆశీర్వదించాడని అనేక వార్తా కథనాలు రిపోర్ట్ చేసాయి. అంతే కాకుండా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పీఠాన్ని సందర్శించినప్పుడు తీసిన ఫోటోని శృంగేరి పీఠాధిపతి రాహుల్ గాంధీకి బహూకరించినట్టు కూడా వార్తా కథనాలు రిపోర్ట్ చేసాయి. పీఠాధిపతి ఆశీర్వదించడానికి నిరాకరించినట్టు ఎటువంటి ఆధారాలు లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఫోటో పాతది. 2018లో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి సిద్దరామయ్య మరియు రాహుల్ గాంధీ శృంగేరి మఠాన్ని దర్శించుకున్నప్పటిది. 2018 తర్వాత రాహుల్ గాంధీ శృంగేరి మఠాన్ని దర్శించుకున్నట్టు ఎటువంటి కథనాలు లేవు.

పోస్టులోని ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా 2018లో ఇవే ఫోటోలను షేర్ చేస్తూ కర్ణాటక కాంగ్రెస్ మరియు సిద్దరామయ్య చేసిన ట్వీట్లు మాకు కనిపించాయి. ఐతే కర్ణాటక కాంగ్రెస్ చేసిన ట్వీట్‌లో శృంగేరి పీఠాన్ని దర్శించుకొని, పీఠాధిపతి ఆశీర్వాదం తీసుకున్నట్టు స్పష్టంగా పేర్కొన్నారు.

2018లో ఈ వార్తను రిపోర్ట్ చేసిన కథనాలు (ఇక్కడ మరియు ఇక్కడ) కూడా రాహుల్ గాంధీ మరియు సిద్ధరామయ్యలు శృంగేరి పీఠాన్ని దర్శించుకొని, పీఠాధిపతి ఆశీర్వాదం తీసుకున్నట్టు రిపోర్ట్ చేసాయే కానీ పీఠాధిపతి వారిని ఆశీర్వదించడానికి నిరాకరించినట్టు ఎక్కడ కూడా రిపోర్ట్ చేయలేదు. ఒకవేళ నిజంగానే శృంగేరి పీఠాధిపతి వారిని ఆశీర్వదించడానికి నిరాకరించి ఉంటే, వార్తా కథనాలు ఈ విషయాన్ని రిపోర్ట్ చేసి ఉండేవి, కాని అలాంటి కథానాలేవి మాకు లభించలేదు.

అంతే కాదు, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పీఠాన్ని సందర్శించినప్పుడు తీసిన ఫోటోని శృంగేరి పీఠాధిపతి రాహుల్ గాంధీకి బహూకరించినట్టు కూడా వార్తా కథనాలు రిపోర్ట్ చేసాయి.

మఠాధిపతి మరియు రాహుల్ గాంధీ మధ్య జరిగిన సంభాషణను కూడా పలు ప్రముఖ వార్తా సంస్థలు ప్రచురించాయి, (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ). ఐతే ఈ కథనాలలో ఎక్కడా పీఠాధిపతి వీరిని ఆశీర్వదించలేదని మాత్రం పేర్కొనలేదు. దీన్నిబట్టి పోస్టులో చేస్తున్న వాదన కరెక్ట్ కాదని స్పష్టమవుతుంది.

చివరగా, 2018లో శృంగేరి మఠాన్ని దర్శించుకున్నప్పుడు పీఠాధిపతి రాహుల్ గాంధీని ఆశీర్వదించడాని అనేక రిపోర్ట్స్ ఉన్నాయి, ఆశీర్వదించడానికి నిరాకరించాడన్న వాదన తప్పు.

Share.

About Author

Comments are closed.

scroll