Fake News, Telugu
 

తమకు వీలుగా ఉన్న ఫోటోలను పెట్టి, జవాన్లకు ఇచ్చే గౌరవంలో మన్మోహన్ మరియు మోదీ మధ్య వ్యత్యాసం అని తప్పుదోవ పట్టిస్తున్నారు

0

దేశ సైనికులను ఎలా గౌరవించాలో మన్మోహన్ సింగ్ కి తెలుసు అని, దేశ సైనికుల విలువ నరేంద్ర మోదీ కి తెలియదని చెప్తూ, రెండు ఫోటోలతో కూడిన పోస్ట్ ని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. పోస్ట్ లోని ఒక ఫోటోలో సైనికులు కుర్చీల్లో కూర్చొని ఉంటే మన్మోహన్ సింగ్ నిలబడి వారితో మాట్లాడుతున్నట్టు చూడవొచ్చు; మరో ఫోటోలో నరేంద్ర మోదీ కుర్చీలో కూర్చొని కింద కూర్చున్న వారితో మాట్లాడుతున్నట్టు చూడవొచ్చు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: దేశ సైనికులకు ఇచ్చే గౌరవంలో మన్మోహన్ సింగ్ మరియు నరేంద్ర మోదీ మధ్య వ్యత్యాసాన్ని ఫోటోల్లో చూడవొచ్చు.

ఫాక్ట్: పోస్ట్ లోని రెండు ఫోటోలు నిజమే. అయితే, మన్మోహన్ సింగ్ కుర్చీలో కూర్చొని కింద కూర్చున్న జవాన్లతో మాట్లాడుతున్న ఫోటోని మరియు నరేంద్ర మోదీ నిల్చొని జవాన్లతో మాట్లాడుతున్న ఫోటోలను ఇంటర్నెట్ లో చూడవొచ్చు. కావున, తమకు వీలుగా ఉన్న ఫోటోలను ఎంచుకొని, దేశ సైనికులకు ఇచ్చే గౌరవంలో మన్మోహన్ సింగ్ మరియు నరేంద్ర మోదీ మధ్య వ్యత్యాసం అని చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

మన్మోహన్ సింగ్ ఫోటో:

పోస్ట్ లోని మన్మోహన్ సింగ్ ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, ఆ ఫోటోకి సంబంధించి ఎటువంటి కచ్చితమైన సమాచారం సెర్చ్ రిజల్ట్స్ లో రాలేదు. అయితే, అలాంటి ఫోటోనే ఒకటి సెర్చ్ రిజల్ట్స్ లో వచ్చింది. రెండు ఫోటోల్లో ఒకే లాంటి టేబుల్, ప్లేట్లు, మరియు వెనుక కర్టెన్లు ఉన్నట్టు చూడవొచ్చు. మన్మోహన్ సింగ్ ప్రధాని గా ఉన్నప్పుడు అరుణాచల్ ప్రదేశ్ లో సైనికులను 2008 లో కలిసినప్పుడు ఆ ఫోటోని తీసినట్లుగా తెలిసింది.

అయితే, 2005 లో తీసిన ఒక ఫోటోలో మన్మోహన్ సింగ్ కుర్చీలో కూర్చొని కింద కూర్చున్న జవాన్లతో మాట్లాడుతున్నట్టు చూడవొచ్చు.

నరేంద్ర మోదీ ఫోటో:

పోస్ట్ లోని అదే ఫోటోని నరేంద్ర మోదీ వెబ్ సైట్ లో చూడవొచ్చు. 2013 లో నరేంద్ర మోదీ గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు దసరా రోజున శస్త్రపూజ నిర్వహించిన సందర్భంలో ఆ ఫోటోని తీసినట్టు తెలిసింది. పోలీసులు మరియు భద్రతా సిబ్బందితో శస్త్రపూజ లో పాల్గొన్నట్టు 13 అక్టోబర్ 2013 న మోదీ చేసిన ట్వీట్ ని ఇక్కడ చూడవొచ్చు.

నరేంద్ర మోదీ నిల్చొని జవాన్లతో మాట్లాడుతున్న ఫోటోలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. 

చివరగా, తమకు వీలుగా ఉన్న ఫోటోలను ఎంచుకొని, దేశ సైనికులకు ఇచ్చే గౌరవంలో మన్మోహన్ సింగ్ మరియు నరేంద్ర మోదీ మధ్య వ్యత్యాసం అని చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll