Fake News, Telugu
 

థాయిలాండ్ దేశానికి సంభందించిన ఫోటోను చూపించి ‘భారత దేశంలో తాజమహల్ ని మించిన అద్బుత శిల్పాలు’ అంటూ షేర్ చేస్తున్నారు

0

మన భారత దేశంలో తాజ్ మహల్ ను మించి అద్బుతంగా చెక్కిన ఇలాంటి శిల్పాలను ఏ మీడియా వారు కూడా గుర్తించలేదు,అని ఓ ఫోటో చూపిస్తూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఆ పోస్టులో ఎంత వరకు నిజముందో తెలుసుకుందాం.

ఈ పోస్ట్ యొక్క  ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.    

క్లెయిమ్: భారత దేశంలో తాజ్ మహల్ ను మించి అద్బుతంగా చెక్కిన ఇటువంటి శిల్పాలకు గుర్తింపు లేదు.    

ఫాక్ట్ (నిజం): భారత దేశంలో ఎన్నో అద్భుత శిల్పాలు ఉన్న మాట నిజమే, కాకపోతే ఈ పోస్టులో చూపిస్తున్న ఫోటో భారత దేశానికి సంభందించింది కాదు.ఆ ఫోటోలోని శిల్పాలు,థాయిలాండ్ దేశంలో పట్టాయ నగరంలో నిర్మించిన ‘Sanctuary of truth’ అనే టూరిస్ట్ స్పాట్ కి సంభందించింది.కావున ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.      

పోస్టులో ఉన్న ఫోటోను గూగుల్ రివర్స్ ఇమేజ్  సెర్చ్ చేసినప్పుడు, ఈ ఫోటోలో ఉన్న అవే శిల్పాలు ఒక వీడియోలో లభించాయి. ‘వైస్ వన్దేరేర్’ అనే యుట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో ఈ శిల్పాలు మనం చూడావచ్చు. ఆ వీడియో కింద రాసిన వివరణలో, థాయిలాండ్ దేశంలోని పట్టాయ నగరంలో నిర్మించిన ‘Sanctuary of truth’ అనే హిందూ-బౌద్ధ మతాలకి సంభందించిన దేవాలయంలోని అద్బుతమైన శిల్పాలు ఇవి,అంటూ రాసారు.

అయితే ఆ యుట్యూబ్ ఛానల్ ఇచ్చిన వివరణ ఆధారంగా ఆ దేవాలయం కోసం గూగుల్ లో వెతకగా, Appon’s Travel and Tourism అంటూ రాసిన బ్లాగ్లో, పోస్ట్ లో చూపించిన ఒక శిల్పాన్ని చూడటం జరిగింది. ఈ కట్టడం ఏ మతానికి సంబందించిన దేవాలయము కాదు అని, హిందూ- బౌద్ధ మతాలకి సంభందించిన శిల్పాల ఆదరంగా థాయిలాండ్  లోని ఓ వ్యాపారవేత్త ఇలా కట్టించి ఒక టూరిస్ట్ స్పాట్ గా చేసారు అని  FACTLY విశ్లేషణలో తెలిసింది.

అలాగే ఈ కట్టడాన్ని గూగుల్ స్ట్రీట్ వ్యూ లో వెతికినప్పుడు, ఫోటో లో ఉన్న శిల్పాలను అందులో చూడటం జరిగింది. ఈ విశ్లషణ ద్వార పోస్టులో చూపించిన ఫోటోలు పట్టాయ నగరంలో నిర్మించిన ‘Sanctuary of Truth’ అనే టూరిస్ట్ స్పాట్ కి సంభందించింది అని మనం చెప్పొచ్చు.

అయితే, భారత దేశంలో ఎన్నో అద్భుత శిల్పాలు, కట్టడాలు ఉన్నాయి అన్న విషయం నిజమే అయినప్పటికీ, పోస్ట్ లో చూపించిన శిల్పం మాత్రం ఇక్కడిది కాదు.

చివరగా, థాయిలాండ్ దేశంలో నిర్మించిన ‘Sanctuary of Truth’ అనే టూరిస్ట్ స్పాట్ లోని శిల్పాలని చూపి భారత దేశంలోనివి అని అని తప్పుగా షేర్ చేస్తున్నారు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll