Fake News, Telugu
 

బంగ్లాదేశ్ మందిరం దృశ్యాలని పశ్చిమ బెంగాల్‌ దుర్గా పండల్‌లో అతికించిన నమాజ్ సమయ సూచిక అంటూ షేర్ చేస్తున్నారు

0

పశ్చిమ బెంగాల్‌లోని దుర్గా పూజా పందిరిలో నమాజ్ సమయ సూచిక అతికించిన దృశ్యం, అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతుంది. నమాజ్ సమయం రాగానే హిందువులు “లాహ్ ఇలాహ ఇల్లలా: అల్లాహ్ తప్ప మరో దేవుడు ఆరాధనకు అర్హుడు కాడు” అనే అరుపులు విని ఆనందించి, ఆ తరువాత తమ పూజలు చేసుకోవాలని దీని అర్థం అంటూ ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: పశ్చిమ బెంగాల్‌లోని దుర్గా పూజా పందిరిలో నమాజ్ సమయ సూచిక అతికించిన దృశ్యం.

ఫాక్ట్ (నిజం): ఈ ఫోటోలో కనిపిస్తున్నది బంగ్లాదేశ్ ఢాకా నగరంలోని దుర్గా మాత ఆలయం. బంగ్లాదేశ్ ఉత్తర సర్బోజోనిన్ పూజ కమిటీ సభ్యులు, రోజువారీ ముస్లిం ఆచారాల గురించి భక్తులకు అవగాహన కల్పించడానికి, ఇస్లామిక్ ప్రార్థనల సమయంలో అంతరాయం కలిగించకుండా ఉండటానికి ఇస్లామిక్ ప్రార్థన సమయాలని ఇలా దుర్గా మాత ఆలయంలో అతికించారు. ఈ ఫోటోలో కనిపిస్తున్నది పశ్చిమ బెంగాల్‌లోని దుర్గా మాత పూజా పందిరి కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోకు సంబంధించిన వివరాల కోసం గుగూల్‌లో వెతికితే, ఇదే ఫోటోని షేర్ చేస్తూ ‘Daily Alor Sandhan’ అనే న్యూస్ పోర్టల్ 14 అక్టోబర్ 2021 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఈ ఫోటోలో కనిపిస్తున్నది బంగ్లాదేశ్ ఢాకా నగరంలోని దుర్గా పూజా పండల్‌ అని ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసారు.

ఈ ఫోటోకు సంబంధించిన మరింత సమాచారం కోసం వెతకగా, ఇదే ఫోటోని షేర్ చేస్తూ బంగ్లాదేశ్‌కి చెందిన ‘Daily Frontier’ వార్తా సంస్థ 14 అక్టోబర్ 2021 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఢాకా సబ్-అర్బన్ ప్రాంతం ఉత్తరాలోని దుర్గా పూజా మందిరంలో, నమాజ్ సమయ సూచిక మండపం ముందు అతికించిన దృశ్యాలని ఈ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసారు. ఉత్తర సర్బోజోనిన్ పూజ కమిటీ సభ్యులు, రోజువారీ ముస్లిం ఆచారాల గురించి భక్తులకు అవగాహన కల్పించడానికి, ఇస్లామిక్ ప్రార్థనల సమయంలో అంతరాయం కలిగించకుండా ఉండటానికి ఇస్లామిక్ ప్రార్థన సమయాలని ఇలా దుర్గా మాత ఆలయంలో అతికించినట్టు ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసారు.

చివరగా, బంగ్లాదేశ్ మందిరంలోని దృశ్యాలని పశ్చిమ బెంగాల్‌ దుర్గా మాత పూజా పందిరిలో నమాజ్ సమయ సూచిక అతికించిన దృశ్యమంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll