Fake News, Telugu
 

ఒక వ్యంగ్యపు కథనాన్ని ‘12 ఏళ్లుగా బడ్ వైజర్ బీరు తయారీ ట్యాంకు లో మూత్రం పోస్తున్నట్లు ఒప్పుకున్న ఉద్యోగి’ అని షేర్ చేస్తున్నారు

0

కొలరాడోలోని ఫోర్ట్ కొలిన్స్ సిటీలో ఉన్న బడ్ వైజర్ బీరు ఫ్యాక్టరీలో పనిచేస్తోన్న ఒక ఉద్యోగి తాను 12 ఏళ్లుగా బీరు తయారీ ట్యాంకులో మూత్రం పోస్తున్నట్లు ఒప్పుకున్నాడని ఒక వార్త సోషల్ మీడియా లో విస్తారంగా చలామణీ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కొలరాడోలోని బడ్ వైజర్ బీరు ఫ్యాక్టరీలో పనిచేస్తోన్న ఒక ఉద్యోగి తాను 12 ఏళ్లుగా బీరు తయారీ ట్యాంకు లో మూత్రం పోస్తున్నట్లు ఒప్పుకున్నాడు.

ఫాక్ట్ (నిజం): వ్యంగ్యపు వార్తలు రాసే వెబ్‌సైట్ ‘Foolish Humor’ అందరి కంటే ముందు ఆ విషయంతో కథనాన్ని ప్రచురించింది. ఆ వెబ్‌సైట్‌లోని కథనాలు కేవలం ‘ఎంటర్టైన్మెంట్’ కోసం మాత్రమే మరియు అవి ‘ఫిక్షన్ (కాల్పనికం)’ అని వెబ్‌సైట్ లోనే రాసి ఉంది. పోస్టు లో చెప్పిన విషయం వాస్తవ ఘటనది కాదు. కావున, పోస్ట్ లో చెప్పింది తప్పు

స్క్రీన్‌షాట్‌లో కనిపించే కీవర్డ్స్ తో మేము గూగుల్‌లో వెతికినప్పుడు, బడ్ వైజర్ ఉద్యోగి వాల్టర్ పావెల్ (వ్యక్తిగత గోప్యత కోసం పేరు మార్చిన్నట్లుగా కథనంలో పేర్కొన్నారు) 12 ఏళ్లుగా తాను బడ్ వైజర్ బీరు తయారీ ట్యాంకు లో మూత్రం పోస్తున్నట్లు ఒప్పుకున్నాడనే కథనాన్ని చాలా వెబ్‌సైట్లు ప్రచురించినట్లుగా తెలిసింది. అయితే ఆ కథనాన్ని మొట్టమొదటగా ‘Foolish Humor’ అనే వెబ్‌సైట్  ‘08 మే 2020 న’ ప్రచురించినట్లు తెలిసింది.

ఆ కథనాన్ని చూసినప్పుడు, పేజీ చివరన ‘Foolish Humor’ వెబ్‌సైట్ కేవలం ‘ఎంటర్టైన్మెంట్’ కోసం మాత్రమే అని అందులోని కథనాలు కాల్పనికమని, అవి వాస్తవ ఘటనలు కాదని పేర్కొని ఉంది.

పైన పేర్కొన్న కథనంలో బడ్ వైజర్ క్యాన్ పట్టుకుని ఉన్న వ్యక్తి ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ చేసినప్పుడు, 2013 లో ప్రచురితం అయిన ‘Times union’ కథనం లభించింది. ఈ ఫోటో కు క్రెడిట్స్ ‘అసోసియేటెడ్ ప్రెస్’ అని ఉంది మరియు వివరణలో ఫోటోలోని వ్యక్తి న్యూయార్క్‌లోని లైసాండర్‌లో ఉన్న బడ్‌ వైజర్ బ్రూవరీ జనరల్ మేనేజర్ నిక్ మిల్స్ అని రాసి ఉంది.

చివరగా, వ్యంగ్యపు వార్తలు రాసే వెబ్‌సైట్ యొక్క ఒక కాల్పనిక కథనాన్ని ‘12 ఏళ్లుగా బడ్ వైజర్ బీరు తయారీ ట్యాంకు లో మూత్రం పోస్తున్నట్లు ఒప్పుకున్న ఉద్యోగి’ అని షేర్ చేస్తున్నారు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll