Fake News, Telugu
 

వీడియోలో భారత్ మరియు పాక్ సైనికాధికారులు పరస్పరం ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నది దీపావళి సందర్భంగా కాదు

0

భారత్ మరియు పాక్ సైనికాధికారులు పరస్పరం ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకు వీడియో ని ఫేస్బుక్ లో పోస్టు చేసి, ఆ ఘటన దీపావళి సందర్భంగా జరిగిందంటూ ఆరోపిస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవమో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: వీడియో దీపావళి సందర్భంగా భారత్ మరియు పాక్ సైనికధికారులు పరస్పరం ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నప్పటిది.

ఫాక్ట్ (నిజం): వీడియో లో భారత్ మరియు పాక్ సైనికధికారులు పరస్పరం ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నది 2015 లో భారత 66వ గణతంత్ర దినోత్సవం (రిపబ్లిక్ డే) సందర్భంగా, దీపావళి సందర్భంగా కాదు. కావున, పోస్టు లో చేసిన ఆరోపణ తప్పు.

పోస్టులో పెట్టిన వీడియో గురించిన సమాచారం కోసం యూట్యూబ్ లో ‘Indian soldiers exchange sweets with Pakistan at LoC’ అని వెతికినప్పుడు, చాలా సెర్చ్ రిజల్ట్స్ వచ్చాయి. వాటిలో, ఆ వీడియోకి సంబంధించిన విజువల్స్ తో ఉన్న ‘Headlines Today’ వారి న్యూస్ వీడియో లభించింది. దాని ద్వారా, 2015 లో భారత 66వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత్ మరియు పాక్ సైనికధికారులు పరస్పరం ఒకరికొకరు స్వీట్ లు ఇచ్చిపుచ్చుకున్నారని తెలుస్తుంది.

‘ANI’ వార్తా సంస్థ వారి ట్వీట్ ద్వారా కూడా, ఆ వీడియో భారత 66వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా  తీసినదని తెలుస్తుంది

చివరగా, వీడియోలో భారత్ మరియు పాక్ సైనికాధికారులు పరస్పరం ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నది దీపావళి సందర్భంగా కాదు, భారత 66వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll