Fake News, Telugu
 

ఈ ఫోటోలో కనిపిస్తున్న రెండు రకాల 500 రుపాయల నోట్లు ఆమోదయోగ్యమైన కరెన్సీ అని RBI స్పష్టం చేసింది

0

500 రూపాయిల నోటుపై గాంధీ ముఖం పక్కనే ఆకుపచ్చ లైన్లు ఉంటే అది అసలైన నోటని, దూరంగా ఉంటే అది నకిలీ నోటుని  తెలుపుతూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతోంది. గాంధీ ముఖం పక్కనే ఆకుపచ్చ లైన్లు కలిగి ఉన్న 500 రూపాయిల నోటుని, గాంధీ ముఖానికి దూరంగా ఆకుపచ్చ లైన్లు ప్రింట్ అయిన మరొక 500 నోటుని పోలుస్తూ తీసిన ఫోటోని ఈ పోస్టులో షేర్ చేసారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.   

  

క్లెయిమ్: 500 నోటుపై గాంధీ ముఖం పక్కనే ఆకుపచ్చ లైన్లు ప్రింట్ అయి ఉంటే అసలైన నోటని, దూరంగా ఉంటే అది నకిలీ నోటుగా గుర్తించాలి.

ఫాక్ట్ (నిజం): కరెన్సీ నోట్లు ముద్రించే సమయంలో జరిగే కొన్ని పొరపాట్ల వలన నోట్లలో కొన్ని వైవిధ్యాలు ఏర్పడుతాయని, ప్రజలు ఈ రెండు 500 రూపాయిల నోట్ల వేరియంట్లను నిర్భయంగా అంగీకరించవచ్చని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రతినిధి 2016లోనే స్పష్టం చేసారు. ఈ రెండు 500 నోట్ల వేరియంట్లు ఆమోదయోగ్యమైన కరెన్సీ అని స్పష్టం చేస్తూ PIB 2019లో ట్వీట్ కూడా పెట్టింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం ఇంటర్నెట్లో కీ పదాలను ఉపయోగించి వెతికితే, 500 రూపాయిల నోట్లలో ఈ రెండు వేరియంట్లకు సంబంధించి పలు వార్తా సంస్థలు 2016లోనే  ఆర్టికల్స్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. కరెన్సీ నోట్లు ముద్రించే సమయంలో జరిగే కొన్ని పొరపాట్ల వలన నోట్లలో కొన్ని వైవిధ్యాలు ఏర్పడుతాయని, ప్రజలు ఈ రెండు నోట్ల వేరియంట్లను స్వేచ్చగా అంగీకరించవచ్చని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రతినిధి స్పష్టం చేసినట్టు ‘Business Insider’ వార్తా సంస్థ తమ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసింది.

కొత్త 500 రూపాయిల నోట్ల యొక్క సెక్యూరిటీ ఫీచర్స్ జాబితాను వివరిస్తూ ఆర్‌బీఐ తమ వెబ్సైటులో ఒక పోస్టర్  పబ్లిష్  చేసింది. 500 రూపాయిల నోటుపై గాంధీ ముఖం దగ్గరగా ఆకుపచ్చ లైన్లు ప్రింట్ అయి ఉంటేనే అది అసలైన నోటని ఈ పోస్టర్లో ఎక్కడా తెలుపలేదు. 

సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఈ రెండు 500 నోట్ల వేరియంట్లు చెల్లుబాటు అవుతాయని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) 2019లో  ట్వీట్  ద్వారా స్పష్టం చేసింది. 

చివరగా, ఈ ఫోటోలో ఉన్న రెండు 500 నోట్ల వేరియంట్లు ఆమోదయోగ్యమని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. కరెన్సీ ప్రింటింగ్ సమయంలో జరిగిన పొరపాటు వల్ల ఆకుపచ్చ లైన్ల ప్లేస్మెంట్ లో తేడాలు వచ్చాయి.

Share.

About Author

Comments are closed.

scroll