“నరేంద్ర మోదీని ఓడించటానికి 10 మంది ఒకటయ్యారంటే బలవంతుడు ఎవరో మీకే అర్ధమవుతుంది. అలాంటి నాయకుడే మన దేశానికి కావలసింది”, అని ప్రముఖ తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల వ్యాఖ్యలు చేసినట్టు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ బాగా షేర్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని కొనియాడుతూ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు.
ఫాక్ట్ (నిజం): నెహ్రూ, రాజీవ్ గాంధీ తరువాత అంతటి చరిస్మాటిక్ (ఆకర్షణీయవంతమైన) నాయకుడు నరేంద్ర మోదీ అని, తనొక గొప్ప నాయకుడే కాదు మంచి మిత్రుడు కూడా అని రజినీకాంత్ పలు సందర్భాలలో వ్యాఖ్యలు చేశారు. కానీ, పోస్టులో తెలిపినట్టు ప్రతిపక్షాలను ఉద్దేశించి నరేంద్ర మోదీని పొగుడుతూ రజినీకాంత్ ఇటీవల ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం కీ పదాలను ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికితే, నరేంద్ర మోదీని పొగుడుతూ ఇటీవల అటువంటి వ్యాఖ్యలేవీ రజినీకాంత్ చేయలేదని తెలిసింది. నరేంద్ర మోదీకి సంబంధించిన అటువంటి ప్రకటన ఏది రజినీకాంత్ తన సోషల్ మీడియా పేజీలలో పబ్లిష్ చేయలేదు. ఒకవేళ నరేంద్ర మోదీ నాయకత్వాన్ని పొగుడుతూ రజినీకాంత్ అటువంటి వ్యాఖ్యలు చేసివుంటే, ఆ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ అన్ని ప్రముఖ వార్తా సంస్థలు ఆర్టికల్స్ పబ్లిష్ చేసేవి. కానీ, అటువంటి రిపోర్ట్స్ ఏవీ మాకు దొరకలేదు.
నెహ్రూ, రాజీవ్ గాంధీ తరువాత అంతటి చరిస్మాటిక్ (ఆకర్షణీయవంతమైన) నాయకుడు నరేంద్ర మోదీ అని, తనొక గొప్ప నాయకుడే కాదు మంచి మిత్రుడు కూడా అని రజినీకాంత్ పలు సందర్భాలలో వ్యాఖ్యలు చేశారు. ఇటీవల నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా తమిళ శక్తిగా అభివర్ణించే సింగోల్‌ను (రాజదండం) ప్రతిష్టించడంపై హర్షం వ్యక్తం చేస్తూ నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ రజినీకాంత్ ఒక ట్వీట్ పెట్టారు. కానీ, ప్రతిపక్షాలను ఉద్దేశించి నరేంద్ర మోదీని పొగుడుతూ ఇటీవల ఎటువంటి వ్యాఖ్యలు రజినీకాంత్ చేయలేదు.
ఇదివరకు, కేసీఆర్‌ను ఉద్దేశించి రజినీకాంత్ ఇవే వ్యాఖ్యలు చేశారని సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు, ఫాక్ట్‌లీ దానికి సంబంధించి ఫాక్ట్-చెక్ ఆర్టికల్ పబ్లిష్ చేసింది.
చివరకు, ప్రతిపక్షాలను ఉద్దేశించి నరేంద్ర మోదీని పొగుడుతూ రజినీకాంత్ ఇటీవల ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.