Fake News, Telugu
 

రాహుల్ గాంధీ వయనాడ్ ర్యాలీ వీడియోని గుజరాత్‌లో కాంగ్రెస్ ర్యాలీ దృశ్యాలు అని తప్పుగా షేర్ చేస్తున్నారు

0

ఒక ప్రచార వాహనం చుట్టూ ఎక్కువగా జనం ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో గుజరాత్‌లో ఇటీవల జరిగిన కాంగ్రెస్ పార్టీ ర్యాలీకి సంబంధించినది అని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు. అసలు ఇందులో ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. 

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు 

క్లెయిమ్: ఈ వీడియో ఇటీవల గుజరాత్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ ర్యాలీకి సంబంధించినది. 

ఫాక్ట్: ఈ వీడియో నిజానికి కేరళలోని వయనాడ్‌లో రాహుల్ గాంధీ లోక్ సభ ఎన్నికల నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్ళినప్పుడు నిర్వహించిన ర్యాలీకి చెందినది. ఇది గుజరాత్‌లో కాంగ్రెస్ ర్యాలీ వీడియో కాదు. కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ ప్పుదోవ పట్టించేలా ఉంది.

ఈ వీడియో వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి ఇందులోని కొన్ని కీ ఫ్రేమ్స్ ఉపయోగించి, వాటిని ఇంటర్నెట్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా. వైరల్ వీడియోలో ఉన్న దృశ్యాలను పోలిన దృశ్యాలు ఉన్న కొన్ని వీడియోలు(ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ)మాకు దొరికాయి. 

జాతీయ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బీవీ శ్రీనివాస్ ఈ వీడియోను తన అఫీషియల్ ‘X’ అకౌంట్లో 3వ ఏప్రిల్ 2024న పోస్టు చేస్తూ ఈ వీడియో వయనాడ్‌లో తీసినదిగా చెప్పారు. పోస్టు యొక్క వివరణ బట్టి ఇందులో రాహుల్ గాంధీ ఉన్నారు. 

ఇదే వీడియోని `ఒడిశా యూత్ కాంగ్రెస్’ మరియు కొన్ని కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా అకౌంట్లు పోస్టు చేస్తూ (ఇక్కడ, ఇక్కడ) ‘#WayanadWelcomesRahul’ అని, ‘Wayanad <3 Raga 💝’ చెప్పరు. 

ఏప్రిల్ 2024లో వయనాడ్‌లో రాహుల్ గాంధీ నిర్వహించిన ర్యాలీల గురించి మరింత సమాచారం కోసం ఇంటర్నెట్‌లో తగిన కీ వర్డ్స్ ఉపయోగించి వెతుకగా, ఈ వీడియో రాహుల్ గాంధీ లోక్ సభ ఎంపీగా పోటీ చేస్తున్న వయనాడ్‌లో తాను నామినేషన్ వేసే ముందు 3వ ఏప్రిల్ 2024న పాల్గొన్న ఒక ర్యాలీలోది అని మాకు తెలిసింది.

ఈ ర్యాలీ/రోడ్ షో యొక్క వీడియోని రాహుల్ గాంధీ యొక్క అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో అప్లోడ్ చేసారు, దాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ ర్యాలీకి సంబంధించిన వార్తా కథనాలు మీరు ఇక్కడ,ఇక్కడ చూడవచ్చు. 

అదనంగా, ఇటీవల గుజరాత్‌లో రాహుల్ గాంధీ నిర్వహించిన పబ్లిక్ మీటింగ్ దృశ్యాలని మీరు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. 

చివరిగా, వయనాడ్‌లో రాహుల్ గాంధీ నామినేషన్ వేస్తున్న సమయంలో జరిగిన ర్యాలీ వీడియోని ఇటీవల  గుజరాత్‌లో జరిగిన ర్యాలీ దృశ్యాలని తప్పుగా షేర్ చేస్తున్నారు. 

Share.

About Author

Comments are closed.

scroll