సర్వసత్య మహాసభల్లో బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ పాల్గొననున్నట్టు చెప్తూ, ఒక పోస్టర్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ‘సర్వసత్య మహాసభలకు విచ్చేయుచున్న ఎంపీ బండి సంజయ్ కుమార్’ అని ఉన్న పోస్టర్.
ఫాక్ట్: అది ఒక పాత పోస్టర్. 2019 లో బండి సంజయ్ ని కలిసినప్పుడు తాము నిర్వహిస్తున్న సర్వసత్య మహాసభలకు రమ్మని కోరామని, వారు వస్తాను అని చెప్పారని, వైరల్ అవుతున్నది దానికి సంబంధించిన పోస్టర్ అని FACTLY కి పాస్టర్ మేరుగు శ్యాంపాల్ తెలిపారు. అయితే, వేరే కార్యక్రమాల్లో బిజీగా ఉండి, సర్వసత్య మహాసభలకు బండి సంజయ్ హాజరు కాలేదని పాస్టర్ మేరుగు శ్యాంపాల్ తెలిపారు. కావున, పాత పోస్టర్ ని ఇప్పుడు తాజాగా షేర్ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.
పోస్టర్ లో ఉన్న పాస్టర్ మేరుగు శ్యాంపాల్ కి FACTLY ఫోన్ చేసి మాట్లాడగా, వైరల్ అవుతున్నది పాత పోస్టర్ అని వారు తెలిపారు. క్రైస్తవుల పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలని చెప్తూ, ఒక వీడియో వైరల్ అయింది. ఆ విషయం పై 2019 లో బండి సంజయ్ ని కలిసినప్పుడు, అది ఒక పాత వీడియో అని చెప్పి, తమను మర్యాదపూర్వకంగా చూసుకున్నారని పాస్టర్ మేరుగు శ్యాంపాల్ చెప్పారు. ఆ సందర్భంలోనే తాము నిర్వహిస్తున్న సర్వసత్య మహాసభలకు రమ్మని కోరామని, వారు వస్తాను అని చెప్పారని, వైరల్ అవుతున్నది దానికి సంబంధించిన పోస్టర్ అని పాస్టర్ మేరుగు శ్యాంపాల్ తెలిపారు. అయితే, వేరే కార్యక్రమాల్లో బిజీగా ఉండి, సర్వసత్య మహాసభలకు బండి సంజయ్ హాజరు కాలేదని పాస్టర్ మేరుగు శ్యాంపాల్ తెలిపారు. ఈ విషయం పై కొందరు జూన్ 2019 లో పెట్టిన పోస్టులను ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవొచ్చు.
అంతేకాదు, పోస్ట్ లోని పోస్టర్ ని పెట్టి, 7 జూన్ 2019 న యూట్యూబ్ లో పోస్ట్ చేసిన వీడియోని ఇక్కడ చూడవొచ్చు.
చివరగా, ‘సర్వసత్య మహాసభలకు బండి సంజయ్’ అని ఉన్న పోస్టర్ పాతది; ఆ సభలకు బండి సంజయ్ హాజరుకాలేదని తెలిపిన పాస్టర్ మేరుగు శ్యాంపాల్.