దిల్‌సుఖ్‌నగర్ పీ అండ్ టీ కాలనీ లో కొందరు రాత్రి పూట కరెంటు ఆపి, రోడ్డు పై కరెన్సీ నోట్లు చల్లి వెళ్లారని చెప్తూన్న ఒక మెసేజ్ ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ‘అందరూ జాగ్రత్తగా ఉండండి వీలైనంత బయటకు వెళ్ళకండి వెళ్ళినా ఏది తాకకండి‘ అని చెప్తూ ఆ నోట్ల ద్వార కొరోనా వ్యాప్తి చెందొచ్చు అనే భయాన్ని సృష్టిస్తున్నారు. ఆ ఘటన గురించి తెలుసుకోవడానికి సరూర్ నగర్ పోలీసు వారితో FACTLY మాట్లాడగా, అలాంటి ఘటన ఏదీ కూడా అక్కడ జరగలేదని, వైరల్ అవుతున్న మెసేజ్ ఫేక్ అని వారు తెలిపారు.
సోర్సెస్:
క్లెయిమ్: ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్:
1. సరూర్ నగర్ పోలీసు వారితో FACTLY మాట్లాడింది.
‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?