Fake News, Telugu
 

యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఆవు మూత్రం తాగుతున్నట్లు ఉన్న ఈ ఫోటో ఫోటోషాప్ చేయబడింది

0

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఆవు మూత్రం తాగుతున్నట్లుగా ఉన్న ఫోటో సోషల్ మీడియా లో ప్రచారం అవుతుంది. కానీ, FACTLY ఆ ఫోటోని  ఫోటోషాప్  చేసారు అని తెలుసుకుంది. ఆ ఫోటో గురించి ఇంటర్నెట్ లో వెతికితే ఒక జర్నలిస్ట్ ఆ ఫోటో తప్పంటూ, దానికి సంబంధించిన వాస్తవ ఫోటోని పెట్టిన ట్వీట్ లభించింది. అందులో ఆవు ఉండదు మరియు యోగీ ఆదిత్యనాథ్ ఒక చేతి పంప్ లో నుండి వస్తున్న నీళ్లు తాగుతూ కనిపిస్తాడు. ఆ రెండు ఫోటోలని పోల్చినప్పుడు, అందులోని పరిసారాలన్నీ కూడా ఒకేలా ఉన్నాయి. పోస్టులోని ఫోటోలో ఆవు యొక్క వెనుక భాగాన్ని ఒక వైబ్సైట్ లో ఉన్న  ఆవు ఫోటో నుండి క్రాప్ చేసి పైన ఉన్న ఒరిజినల్ ఫోటోలో చేర్చి పోస్టులోని ఫోటోను సృష్టించారు. ఆ ఫోటో గురించి మరింత సమాచారం కోసం ఇంతకముందు FACTLY రాసిన ఆర్టికల్ ని ఇక్కడ చదవవచ్చు. 

సోర్సెస్:
క్లెయిమ్ – ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్ 
1. జర్నలిస్ట్ ట్వీట్ – https://twitter.com/UnSubtleDesi/status/874276700321972224
2. ఆవు ఫోటో ఉన్న వెబ్సైట్ – http://www.pngmart.com/image/71275

Did you watch our new video?

Share.

About Author

Comments are closed.

scroll