Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

దుబాయ్ కి సంబంధించిన ఫోటో పెట్టి, ఇండియాలో ఇళ్లపై నమాజ్ చేస్తున్నారని షేర్ చేస్తున్నారు

1

కరోనా కల్లోల సమయంలో ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పక అనుసరించాల్సిన తరుణంలో, సామాజిక హితంపట్ల ఎటువంటి బాధ్యత లేని వ్యక్తుల చర్యలు’ అని చెప్తూ, భారత్ లో ఇళ్లపై నమాజ్ చేస్తున్నారని అర్థం వచ్చే ఒక ఫోటోతో కూడిన పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: ఇండియాలో ముస్లింలు ఇళ్లపై నమాజ్ చేస్తున్న ఫోటో.

ఫాక్ట్ (నిజం): ఆ ఫోటో ఇండియాలో తీసింది కాదు. ఫోటోలోని భవనాలు దుబాయ్ లో ఉన్నట్టు FACTLY విశ్లేషణలో తేలింది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ చేసిన ఫోటో బ్యాక్ గ్రౌండ్ లో మసీదు లాంటి బిల్డింగ్ ఒకటి నీటి పక్కన ఉన్నట్టు చూడవొచ్చు. ఆ బిల్డింగ్ గురించి ఇంటర్నెట్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ మరియు కొన్ని పదాలతో వెతకగా, అది దుబాయ్ లో ఉన్న ఒక మసీదు అని తెలిసింది.

ఇళ్లపై నమాజ్ చేస్తున్నవారు నీటికి ఇటుపక్కన ఉన్నట్టు ఫోటోలో చూడవొచ్చు. కావున, గూగుల్ ఎర్త్ లో ఆ భవనాల గురించి నీటికి వేరే పక్కన వెతకగా, ఆ భవనాలు అన్నీ కనిపిస్తాయి. ఆ ఫోటో ఎప్పుడు మరియు ఏ సందర్భంలో తీసారో FACTLY కి సమాచారం దొరకలేదు, కానీ ఆ ఫోటో మాత్రం కచితంగా ఇండియాకి సంబంధించింది కాదు.

చివరగా, దుబాయ్ కి సంబంధించిన ఫోటో పెట్టి, ఇండియాలో ఇళ్లపై నమాజ్ చేస్తున్నారని షేర్ చేస్తున్నారు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll