Fake News, Telugu
 

ఫోటోలు శశి థరూర్ తిరువనంతపురంలోని ఒక ఆలయంలో ‘తులాభారం’ సమర్పిస్తున్నప్పుడు గాయపడినప్పట్టివి

0

తలకి కట్లు కట్టుకుని శశి థరూర్ ఉన్న ఫోటోలని ఫేస్బుక్ లో పోస్టు చేసి, ‘కేరళ గుళ్ళో అన్ని మతాలు సమానం అని చెప్పడానికి క్రైస్తవ ప్రార్థన చేద్దాం అని ప్రయత్నించిన శశి థరూర్ నెత్తిపై పైనుండి రాయి పడి తల పగిలిపోయింది’  అని వాటి గురించి చెప్తున్నారు. కానీ, ఆ ఫోటోలు 2019 లో శశి థరూర్ తిరువనంతపురంలోని గాంధారి అమ్మన్ ఆలయంలో ‘తులాభారం’ సమర్పిస్తున్నప్పుడు గాయపడినప్పట్టివని ‘FACTLY’ విశ్లేషణలో తేలింది. థరూర్ ఆలయంలో ‘తులాభారం’ ఇచ్చే సమయంలో బ్యాలెన్స్ స్కేల్ విరిగి హుక్ సపోర్ట్ వదులుగా అవడంతో కింద పడిపోయాడు. దాంతో ఆయన తలకి మరియు కాలుకి గాయాలయ్యాయి. ‘తులాభారం’ అనేది ఒక ‘హిందూ’ ఆచారం, అందులో ఒక వ్యక్తి బరువుకి సరిసమానమైన బరువుతో బంగారం లేదా ధాన్యం లేదా పండ్లని కొలిచి విరాళంగా ఇస్తారు.

సోర్సెస్:
క్లెయిమ్: ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్:
1. న్యూస్ ఆర్టికల్ – https://www.thenewsminute.com/article/shashi-tharoor-suffers-fall-during-temple-ritual-kerala-admitted-hospital-100048
2. న్యూస్ ఆర్టికల్ – https://www.deccanherald.com/national/south/shashi-tharoor-injured-during-tulabharam-728728.html

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll