Fake News, Telugu
 

ఈ ఫోటోలో ఫైజర్ కోవిడ్-19 వాక్సిన్ (vaporizer cartridge) పేరుతో ఉన్నది ఫేక్ వాక్సిన్

0

ఫోటోలో ఉన్నది చైనా లో తయారు చేయబడిన ఫైజర్ కోవిడ్-19 వాక్సిన్ (vaporizer cartridge) అని చెప్తూ, ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో కొందరు షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: ఫోటోలో ఉన్నది చైనా లో తయారు చేయబడిన ఫైజర్ కోవిడ్-19 వాక్సిన్ (vaporizer cartridge)

.ఫాక్ట్: ఫైజర్ వారి కోవిడ్-19 వ్యాక్సిన్ ని ఇంజెక్షన్ ద్వారా చేయికి ఇస్తారు; ఆవిరి లాగా పీల్చుకోవడానికి వీలుండదు. అంతేకాదు, ‘vaporizer cartridge’ అని ఉన్న కోవిడ్-19 వాక్సిన్ ఫేక్ అని ఫైజర్ వారు రాయిటర్స్ మీడియా సంస్థకి తెలిపారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

ఫైజర్ వారి కోవిడ్-19 వ్యాక్సిన్ కి సంబంధించిన వివరాల కోసం ఇంటర్నెట్ లో వెతకగా, ఫైజర్/బ‌యోఎన్‌టెక్ కోవిడ్-19 వ్యాక్సిన్ ని ఇంజెక్షన్ ద్వారా చేయికి ఇస్తారని, ఆవిరి లాగా పీల్చుకోవడానికి వీలుండదని తెలిసింది. కానీ, పోస్ట్ చేసిన ఫోటోలో ఉన్న వాక్సిన్ ప్రోడక్ట్ మీద ‘vaporizer cartridge’ అని రాసి ఉన్నట్టు చూడవొచ్చు. ఫైజర్ వారి కోవిడ్-19 వాక్సిన్ ని రెండు డోసుల్లో ప్రజలకు ఇస్తారు.

ఫైజర్ వారి వెబ్సైటులో కూడా ‘vaporizer cartridge’ లాగా కోవిడ్-19 వాక్సిన్ ని తయారు చేస్తున్నట్టు ఎక్కడా రాసి లేదు. కేవలం ఇంజెక్షన్ ద్వారా ఇచ్చే ‘BNT162’ కోవిడ్-19 వాక్సిన్ గురించి మాత్రమే వారి వెబ్సైటులో ఉంది.

అంతేకాదు, ‘vaporizer cartridge’ అని ఉన్న కోవిడ్-19 వాక్సిన్ ఫేక్ అని ఫైజర్ వారు తమకి ఈ-మెయిల్ ద్వారా తెలిపినట్టు రాయిటర్స్ మీడియా సంస్థ రిపోర్ట్ చేసింది. జర్మనీ, బెల్జియం మరియు అమెరికా దేశాల్లో ఫైజర్/ బ‌యోఎన్‌టెక్ కోవిడ్-19 వ్యాక్సిన్ యొక్క తయారీ జరుగుతున్నట్టు కూడా వారు రిపోర్ట్ చేసారు. ఫైజర్ కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ మరియు ఇక్కడ చదవొచ్చు. ఫైజర్ వారికి FACTLY కూడా ఈ-మెయిల్ చేసింది; వారి నుండి సమాధానం రాగానే ఈ ఆర్టికల్ అప్డేట్ చేయబడుతుంది.

చివరగా, ఫోటోలో ఫైజర్ కోవిడ్-19 వాక్సిన్ (vaporizer cartridge) పేరుతో ఉన్నది ఫేక్ వాక్సిన్.

Share.

About Author

Comments are closed.

scroll