Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

తాజాగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు సుమారు ఆరు రూపాయలు తగ్గలేదు

0

తాజాగా పెట్రోల్ పై రూ. 6.40 మరియు డీజిల్ పై రూ. 6.80 పెట్రోల్ సంస్థలు తగ్గించాయని, కానీ ఏ మీడియా సంస్థ దాని గురించి ప్రచురించలేదని చెప్తూ ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: తాజాగా పెట్రోల్ పై రూ. 6.40 మరియు డీజిల్ పై రూ. 6.80 తగ్గించిన పెట్రోల్ సంస్థలు.

ఫాక్ట్ (నిజం): తాజాగా పెట్రోల్ ధర రూ. 6.40 మరియు డీజిల్ ధర రూ. 6.80 తగ్గలేదు. గత మూడు వారాల్లో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు కేవలం సుమారు రెండు రూపాయలు మాత్రమే తగ్గాయి. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

గత మూడు వారాల్లో (అంటే 1 మార్చి 2020 నుండి ఈ రోజు వరకు) పెట్రోల్ మరియు డీజిల్ ధరలు కేవలం సుమారు రెండు రూపాయలు మాత్రమే తగ్గినట్టు ‘IOCL’ వెబ్సైటులో చూడవొచ్చు. ఆ సమయంలో క్రూడ్ ఆయిల్ ధర భాగ తగ్గినందున పెట్రోల్ మరియు డీజిల్ ధరలు కూడా తగ్గుతాయని అందరు భావించారు, కానీ తాజాగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ మరియు డీజిల్ పై మూడు రూపాయులు ఎక్సైజ్ డ్యూటీ పెంచింది. కావున, తాజాగా పెట్రోల్ సంస్థలు పెట్రోల్ పై రూ. 6.40 మరియు డీజిల్ పై రూ. 6.80 తగ్గించలేదు.

పోస్టులోని విషయాన్నే చెప్తూ, కొందరు ‘మింట్’ వార్తాసంస్థ వారి ఆర్టికల్ ఫోటోని కూడా ఫేస్బుక్ లో పోస్ట్ (ఆర్కైవ్డ్) చేస్తున్నారు. అయితే, 11 జనవరి 2020 తో పోలిస్తే ఇప్పటి క్రూడ్ ఆయిల్ బారెల్ ధర సగానికి పైగా తగ్గిందని, కానీ పెట్రోల్ మరియు డీజిల్ ధరలు మాత్రం కేవలం సుమారు ఆరేడు రూపాయిలు మాత్రమే తగ్గిందని ఆ ఆర్టికల్ లో చదవొచ్చు. తాజాగా, ఆరేడు రూపాయులు తగ్గినట్టు వారు చెప్పలేదు. గత కొన్ని నేలలుగా క్రూడ్ ఆయిల్ బారెల్ ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడవొచ్చు.

చివరగా, గత మూడు వారాల్లో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు కేవలం రెండు రూపాయలు మాత్రమే తగ్గాయి.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll