Fake News, Telugu
 

ఈ వీడియోలో రామ భజన కీర్తన పాడుతున్నది పూజ్య ప్రేమ్ భూషణ్‌జీ మహారాజ్, ప్రధాని నరేంద్ర మోదీ కాదు

0

ప్రధాని నరేంద్ర మోదీ రామ భజన గీతాన్ని పాడుతునప్పుడు రికార్డ్ చేసిన ఆడియో క్లిప్ అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: రామ భజన గీతాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పాడుతునప్పుడు రికార్డ్ చేసిన ఆడియో క్లిప్.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియోలో రామ భజన కీర్తన పాడుతున్నది పూజ్య ప్రేమ్ భూషణ్‌జీ మహారాజ్, ప్రధాని నరేంద్ర మోదీ కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియోకి సంబంధించిన సంబంధిత పదాలను ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికితే, ఇదే ఆడియోని షేర్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పలు వీడియోలు దొరికాయి. ఈ ఆడియో క్లిప్‌లో  రామ భజన పాడుతున్నది పూజ్య ప్రేమ్ భూషణ్‌జీ మహారాజ్ అని కొంతమంది యూట్యూబ్ యూసర్లు ఈ రామ భజన వీడియోలని షేర్ చేస్తూ  తెలిపారు.

వీడియోలోని ఆడియోకీ సంబంధించిన స్పష్టమైన సమాచారం కోసం ఇంకొన్ని సంబంధిత పదాలను ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికితే, వీడియోలోని అదే ఆడియో, పూజ్య ప్రేమ్ భూషణ్‌జీ మహారాజ్ యూట్యూబ్ చానెల్ పబ్లిష్ చేసిన ఒక వీడియోలో కనుగొనగలిగాము. పూజ్య ప్రేమ్ భూషణ్‌జీ మహారాజ్ 2021 మార్చి నెలలో నిర్వహించిన ఒక భజన ఆడియోని పోస్టులోని వీడియో షేర్ చేస్తుంది. పోస్టులో షేర్ చేసిన వీడియోలో రామ భజన పాడుతున్నది పూజ్య ప్రేమ్ భూషణ్‌జీ మహారాజ్ అని, ప్రధాని నరేంద్ర మోదీ కాదని పై వివరాల ఆధారంగా ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, ఈ వీడియోలో రామ భజన కీర్తన పాడుతున్నది పూజ్య ప్రేమ్ భూషణ్‌జీ మహారాజ్, ప్రధాని నరేంద్ర మోదీ కాదు.

Share.

About Author

Comments are closed.

scroll