Fake News, Telugu
 

రాజస్తాన్ లోని పసిఫిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అందరికీ ఉచితంగా వైద్యం అందిస్తుందని చేస్తున్న ప్రచారం తప్పు

0

రాజస్తాన్ రాష్ట్రం ఉదయపూర్ నగరంలోని పసిఫిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ హాస్పిటల్ లో వివిధ రోగాలతో బాధపడుతున్న ప్రజలకి ఉచితంగా వైద్యం అందిస్తుందంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతుంది. పది లక్షలు ఖర్చు అయ్యే  వైద్యం కూడా ఈ హాస్పిటల్ ఉచితంగానే చేస్తునట్టు ఈ పోస్టులో తెలిపారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: రాజస్తాన్ లోని పసిఫిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అందరికి ఉచితంగా వైద్యం అందిస్తుంది.

ఫాక్ట్ (నిజం): రాజస్తాన్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య పథకాల లబ్దిదారులకి మాత్రమే ఉచితంగా వైద్యం అందిస్తునట్టు, పసిఫిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ యాజమాన్యం FACTLY కి తెలిపింది. రాజస్తాన్ ప్రభుత్వం Bhamashah Swasthya Bima Yojana (BSBY) పథకం ద్వార అర్హులైన పేద వారికి ఉచితంగా వైద్యం అందిస్తుంది. BSBY పథకం ద్వార రాజస్తాన్ ప్రభుత్వం అత్యధికంగా మూడు లక్షల వరకు ఉచితంగా వైద్యం అందిస్తుంది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.   

పసిఫిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అనే హాస్పిటల్ పోస్టులో చేబుతునట్టు రాజస్తాన్ రాష్ట్రం ఉదయపూర్ నగరంలోని ఉమర్ద గ్రామా సమిపంలో ఉన్నట్టు తెలిసింది. ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ కు సంబంధించి పసిఫిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ యాజమాన్యాన్ని సంప్రదించగా, తాము అందరికి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తప్పని స్పష్టం చేసారు. రాజస్తాన్ ప్రభుత్వం అమలుచేస్తున్న ఆరోగ్య పథకాల లబ్దిదారులకి మాత్రమే తాము ఉచితంగా వైద్యం అందిస్తునట్టు, పసిఫిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ యాజమాన్యం FACTLY కి తెలిపింది.

రాజస్తాన్ ప్రభుత్వం Bhamashah Swasthya Bima Yojana (BSBY) పథకం ద్వారా అర్హులైన పేద వారికి ఉచితంగా వైద్యం అందిస్తుంది. BSBY పథకం ద్వార రాజస్తాన్ ప్రభుత్వం అత్యధికంగా మూడు లక్షల వరకు ఉచితంగా వైద్యం అందిస్తుంది.

BSBY పథకం అమలు చేయబడుతున్న ప్రైవేట్ హాస్పిటల్స్ జాబితాలో ఈ పసిఫిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కూడా ఉంది. ఈ వివరాల ఆధారంగా పసిఫిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ హాస్పిటల్ ఉచితంగా వైద్యం అందిస్తునట్టు షేర్ అవుతున్న సమాచారం తప్పని ఖచ్చితంగా చెప్పవచ్చు. 

చివరగా, రాజస్తాన్ లోని పసిఫిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అందరికి ఉచితంగా వైద్యం అందిస్తుందని తప్పుగా ప్రచారం చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll