Fake News, Telugu
 

ప్యూ సర్వేలో పాల్గొన్న ప్రతి పది మందిలో ఎనమిది మంది మోదీకి, ఆరుగురు రాహుల్ గాంధీకి తమ సానుకూలతను తెలిపారు

0

ప్యూ రీసెర్చ్ సర్వే ప్రకారం, దేశంలో మోదీకి సానుకూలంగా ప్రతి పది మందిలో ఎనమిది మంది ఉన్నారు అంటూ, సానుకూలత చూపని మిగిలిన ఇద్దరు కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ వారు అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టును షేర్ చేస్తున్నారు. ఈ పోస్టులో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్ : పూ రీసెర్చ్ సర్వేలో, దేశంలో ప్రతి పది మందిలో ఎనమిది మంది మోదీకి సానుకూలత తెలిపారు; మిగిలిన ఇద్దరు కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ వారు.

ఫాక్ట్:  పూ సర్వే చేసిన మొత్తం 2,611 భారతీయులలో, పది మందిలో ఎనమిది మంది ప్రధాని మోదీకి తమ సానుకూలతను తెలుపగా, అదే 2,611 మంది నుంచి పది మందిలో ఆరుగురు రాహుల్ గాంధీ పై తమ సానుకూల అభిప్రాయాన్ని తెలిపారు అని సర్వే స్పష్టం చేస్తుంది. కావున పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఆర్టికల్ ప్యూ రీసెర్చ్ సెంటర్ అనే అమెరికాకి చెందిన ఒక రీసెర్చ్ సంస్థ పబ్లిష్ చేసింది. 25 మర్చి 2023 నుండి 11 మే 2023 వరకు నాలుగు పెద్ద నగరాలకు (అహ్మదాబాద్, బెంగళూరు, కోల్‌కతా మరియు చెన్నై) చెందిన 2,611 భారతీయులతో ముఖాముఖి సర్వే జరిపారు. ఈ సర్వే భారతీయులకు తమ నాయకులపై ఉన్న అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రక్రియ. సర్వేలో బీజేపీ, కాంగ్రెస్ నాయకుల పట్ల ప్రజల అభిప్రాయాలను మూడు భాగాలుగా తీసుకున్నారు:
1. కొంతవరకు లేదా చాలా ప్రతికూలం
2. కొంత అనుకూలం
3. చాలా అనుకూలం.

సర్వే ప్రకారం, మొత్తంగా 99% మోదీపై అభిప్రాయాన్ని తెలిపిన ప్రజలలో 79% మంది భారతీయులు మోదీపై తమ సానుకూల అభిప్రాయాన్ని తెలుపగా, 96% ప్రజలలో 62% మంది రాహుల్ గాంధీకి తమ సానుకూలతను తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్ సభలో కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరీ మీద 77% మరియు 72%  మంది మాత్రమే తమ అభిప్రాయాన్ని తెలుపగా, ఖర్గేకు 46% మంది, చౌదరీకి  42% మంది సానుకూలతను తెలిపారు.

అయితే, మొత్తం 2,611 భారతీయులలో, పది మందిలో ఎనమిది మంది ప్రధాని మోదీకి తమ అనుకూలతను తెలుపగా, అదే 2,611 జనాభాలో నుంచి పది మందిలో ఆరుగురు రాహుల్ గాంధీకి అనుకూల అభిప్రాయాన్ని తెలిపారు అని సర్వే స్పష్టం చేస్తుంది. సర్వే మెథడాలజీ, ప్రశ్నలను ఇక్కడ మరియు ఇక్కడ చూడండి.

చివరిగా, ప్యూ సర్వే ప్రకారం 2,611 భారతీయ జనాభా నుంచి పది మందిలో ఎనమిది మంది  మోదీకి, అదే జనాభా నుంచి పది మందిలో ఆరుగురు రాహుల్ గాంధీకి తమ సానుకూలతను తెలిపారు.

Share.

About Author

Comments are closed.

scroll