Fake News, Telugu
 

అనేక మతాలకు సంబంధించిన వివిధ దేశాల సంస్థలు ఉక్రెయిన్‌ యుద్ధ పరిస్థితుల్లో సేవలందిస్తున్నాయి

0

ఉక్రెయిన్‌లో నెలకొన్న యుద్ధ పరిస్థితుల్లో ప్రజలకు ఆహరం, మందులు, మరియు వివిధ సేవలందిస్తున్న సంస్థలు అన్నీ భారతీయ మరియు హిందూ మూలాలున్న సంస్థలేనని చెప్తూ, ఒక పోస్ట్‌ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితుల్లో ఆహరం, మందులు, మరియు వివిధ సేవలందిస్తున్న సంస్థలు అన్నీ భారతీయ మరియు హిందూ మూలాలున్న సంస్థలే.

ఫాక్ట్: కేవలం భారతీయ మరియు హిందూ మూలాలున్న సంస్థలే కాదు, అనేక మతాలకు సంబంధించిన వివిధ దేశాల సంస్థలు కూడా ఉక్రెయిన్‌ యుద్ధ పరిస్థితుల్లో సేవలందిస్తున్నాయి. భారతీయ మరియు హిందూ మూలాలున్న సంస్థలే ఉక్రెయిన్‌లో సేవలందిస్తున్నాయని అనడం సరికాదు. కావున పోస్ట్‌ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

కేవలం భారతీయ మరియు హిందూ మూలాలున్న సంస్థలే ఉక్రెయిన్‌లో సేవలందిస్తున్నాయా అని ఇంటర్నెట్‌లో వెతకగా, వివిధ మతాలకు సంబంధించిన మిగితా దేశాల సంస్థలు కూడా ఉక్రెయిన్‌ యుద్ధ పరిస్థితుల్లో సేవలందిస్తున్నట్టు తెలిసింది. వాటిలో కొన్నిటిని కింద లిస్టులో చూడవచ్చు.

1. World Jewish Relief – యూకేకి సంబంధించిన యూదుల మానవతా సంస్థ

2. Samaritan’s Purse – అమెరికాలో ప్రధాన కార్యాలయం ఉన్న క్రైస్తవ సంస్థ

3. Khalsa Aid – యూకేకి సంబంధించిన సిక్కు మానవతా సంస్థ

4. Islamic Reliefఇస్లాం ఆధారిత సంస్థ

ఇవే కావు, ఇంకా చాలా సంస్థలు ఉక్రెయిన్‌ యుద్ధ పరిస్థితుల్లో సేవలందిస్తున్నాయి. కావున, కేవలం భారతీయ మరియు హిందూ మూలాలున్న సంస్థలే ఉక్రెయిన్‌లో సేవలందిస్తున్నాయని అనడం సరికాదు. 

చివరగా, అనేక మతాలకు సంబంధించిన వివిధ దేశాల సంస్థలు కూడా ఉక్రెయిన్‌ యుద్ధ పరిస్థితుల్లో సేవలందిస్తున్నాయి.

Share.

About Author

Comments are closed.

scroll