Fake News, Telugu
 

ఆస్ట్రియాలో జరిగిన ‘వాతావరణ మార్పు’ నిరసనకు సంబంధించిన వీడియో రిపోర్టును చూపిస్తూ ఉక్రెయిన్‌లోని చావులు ఫేక్ అని అంటున్నారు

0

రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో, ఉక్రెయిన్‌లోని చావులు ఫేక్ అని ఒక వీడియోతో ఉన్న పోస్టును సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. భారత మీడియా ఇటువంటి ఫేక్ మృతదేహాలు చూపిస్తోందని మరికొన్ని పోస్టుల ద్వారా అంటున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఉక్రెయిన్‌లోని చావులు ఫేక్ అని వీడియో ద్వారా చూడొచ్చు.

ఫాక్ట్: ఈ వీడియో ఆస్ట్రియాలో జరిగిన ఒక ‘వాతావరణ మార్పు’ నిరసనకు సంబంధించింది; రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంతో దీనికి సంబంధంలేదు. ఆ నిరసనలో భాగంగా, కొందరు శవాలుగా మారి వాతావరణ మార్పుల కారణంగా ఆస్ట్రియాలో ప్రతిరోజూ 49 మరణాలు ఉండవచ్చని చెప్పే ఒక కొత్త అధ్యయనాన్ని సూచనాత్మకంగా చూపించారు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.

వీడియోను స్క్రీన్‌షాట్స్ తీసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే విజువల్స్‌తో ఉన్న పూర్తి వీడియో ఒక ఆస్ట్రియన్ న్యూస్ వెబ్సైటులో లభించింది. కానీ, ఆ వీడియోపై News24 లోగో లేదు.

ఈ పూర్తి వీడియో 04 ఫెబ్రవరి 2022న అప్లోడ్ చేసారు, అంటే రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం మొదలు కాకముందు నుంచే ఈ వీడియో ఇంటర్నెట్‌లో షేర్ అవుతుంది. ఇదే వీడియో OE24.TV వారి అధికారిక యూట్యూబ్‌ ఛానల్‌లో కూడా అదే రోజున అప్లోడ్ చేసినట్టు చూడొచ్చు.

వీడియో యొక్క టైటిల్ ‘WIEN: DEMO GEGEN KLIMAPOLITIK’ని తెలుగులో అనువదించినప్పుడు ‘వియన్నా: క్లైమేట్ పాలసీకి వ్యతిరేకంగా డెమో’ అని ఉంది. అంటే వీడియో వియన్నాకి సంబంధించింది, ఉక్రెయిన్ కాదు. వీడియోలో ఉన్న బ్యానర్లను  తెలుగులో అనువాదం చేస్తే, ‘వాతావరణ రక్షణ చట్టం ప్రాణాలను కాపాడుతుంది’, ‘ప్రస్తుత వాతావరణ విధానం చేయదు’ అని ఉంది. అదే వెబ్సైటులో అదే రోజు అప్లోడ్ చేయబడిన ఒక క్లైమేట్ యక్టివిస్ట్ ఇంటర్వ్యూను కూడా చూడవచ్చు.

వియన్నాలో జరిగిన సంఘటనను రిపోర్ట్ చేసిన వ్యక్తి OE24.TV రిపోర్టర్, ‘మార్విన్ బెర్గౌర్’. తన ఫేస్‌బుక్‌ పేజీలో, మార్విన్ బెర్గౌర్ ఈ వీడియో వియన్నాలో ‘ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్’ క్లైమేట్ నిరసనల నుండి వచ్చినదని స్పష్టం చేశాడు. దాని నేపథ్యంలోనే, కొందరు శవాలుగా మారి వాతావరణ మార్పుల కారణంగా ఆస్ట్రియాలో ప్రతిరోజూ 49 మరణాలు ఉండవచ్చని చెప్పే ఒక కొత్త అధ్యయనాన్ని సూచనాత్మకంగా ప్రస్తావించారు. ఇంతకు ముందు మరో పోస్టులో అదే రిపోర్టర్ మాట్లాడుతూ, ఈ వీడియో కూడా ఇంతకు ముందు కోవిడ్-19కు లింక్ చేస్తూ వైరల్ అయిందని తెలిపాడు.

చివరగా, ఆస్ట్రియాలో జరిగిన ‘వాతావరణ మార్పు’ నిరసనకు సంబంధించిన వీడియో రిపోర్టును చూపిస్తూ ఉక్రెయిన్‌లోని చావులు ఫేక్ అని అంటున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll