Fake News, Telugu
 

పాత వీడియోలను చూపిస్తూ BJP నేతలపై బీహార్ ప్రజలు దాడి చేస్తున్నారని తప్పుగా ప్రచారం చేస్తున్నారు.

0

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన వ్యవసాయ, విద్యుత్ బిల్లులకు వ్యతిరేకంగా బీహార్ లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన BJP నాయకులను రైతులు కొడుతున్నారు అని చెప్తూ, దీనికి సంబంధించిన వీడియో షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన వ్యవసాయ, విద్యుత్ బిల్లులకు వ్యతిరేకంగా బీహార్ లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన BJP నాయకులను రైతులు కొడుతున్న వీడియో.

ఫాక్ట్(నిజం): ఈ వీడియోలు 2016, 2017లో వెస్ట్ బెంగాల్ BJP నేతలపై ఇతర పార్టీనేతలు చేసిన దాడికి సంబంధించినవి. అంతేగాని పోస్టులో చెప్తున్నట్టు కేంద్రం తీసుకు వచ్చిన వ్యవసాయ, విద్యుత్ బిల్లులకు వ్యతిరేకంగా BJP నేతలని ప్రజలు కొడుతున్నారన్న వాదనలో నిజం లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులో ఉన్న వీడియోని జాగ్రత్తగా పరిశీలిస్తే మూడు ఘటనలకు సంబంధించిన వీడియోలను కలిపి ఒక వీడియోగా చేసినట్టు తెలుస్తుంది. కావున ఈ విడియోలోని ఒక్కో భాగాన్ని విడిగా ఫాక్ట్-చెక్ చేద్దాం.

వీడియో క్లిప్ 1(0-4 & 16-23 సెకండ్స్):

పోస్టులో ఉన్న వీడియో లోని ఈ క్లిపింగ్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా వీడియోలో విజువల్స్ ని పోలిన ఫోటోను ప్రచురించిన ఒక 2017 వార్తా కథనం మాకు కనిపించింది. ఈ కథనం ప్రకారం ఈ ఫోటో గోర్ఖ జనముక్తి మోర్చా(GJM) పార్టీ బహిష్కృత నేత  బెనోయ్ తమంగ్ మద్దతుదారులు బెంగాల్ BJP ప్రెసిడెంట్ దిలీప్ ఘోష్, ఇతర BJP నేతలపై దాడి చేసిన సందర్భంలో తీసినవి.

ఈ వార్తా కథనం ఆధారంగా యూట్యూబ్ లో వెతకగా ఈ ఘటనకి సంబంధించిన న్యూస్ వీడియో మాకు కనిపించింది. ఈ కథనంలో కూడా ఈ ఘటన బెంగాల్ BJP నేతలపై GJM నేత బెనోయ్ తమంగ్ అనుచరుల దాడిగానే వివరించారు. దీన్ని బట్టి పోస్టులో ఉన్న వీడియోలోని ఈ క్లిప్ పాతదని, ఇప్పుడు బీహార్ లో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించింది కాదని కచ్చితంగా చెప్పొచ్చు. 

ఈ వీడియో ఇంతకు ముందు వివిధ క్లెయిమ్స్ తో వైరల్ అయినప్పుడు FACTLY వాటిని ఫాక్ట్-చెక్ చేస్తూ రాసిన కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చదవొచ్చు.

వీడియో క్లిప్ 1(5-15 సెకండ్స్) :

పోస్టులో ఉన్న వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా వీడియోలో జరిగిన ఘటన గురుంచి ప్రచురించిన ఒక 2016 న్యూస్ వీడియో మాకు కనిపించింది. ఈ కథనం ప్రకారం BJP కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో పశ్చిమ బెంగాల్ లోని ఆసన్ సోల్ లో పర్యటించినప్పుడు TMC పార్టీ సభ్యులు వారిపై దాడి చేసారు. ఐతే పోస్టులో ఉన్న వీడియో ఈ దాడిలో భాగంగా ఒక BJP కార్యకర్తని కొట్టి అతని బట్టలు చింపేసిన ఘటనకి సంబంధించింది.

ANI వార్తా సంస్థ ఈ దాడికి సంబంధించిన ఫోటోలోను తమ ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసింది. ఈ దాడికి సంబంధించి మరిన్ని వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

ఈ వీడియో ఇంతకు ముందు వివిధ క్లెయిమ్స్ తో వైరల్ అయినప్పుడు FACTLY వాటిని ఫాక్ట్-చెక్ చేస్తూ రాసిన కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చదవొచ్చు.

వీడియో క్లిప్ 1(24-30 సెకండ్స్) :

ఈ క్లిపింగ్ కి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే వీడియో మాకు యూట్యూబ్ లో లభించింది. ఈ వీడియో ఆ ఛానల్ లో 4 సెప్టెంబర్ 2020న అప్లోడ్ చేయబడ్డట్టు ఉంది. ఐతే ఈ వీడియో ఇటీవల కాలానికి సంబంధించిందనిగాని, బీహార్ కి సంబంధించిందనిగాని కచ్చితంగా చెప్పడానికి ఆధారాలు దొర్కనప్పటికీ వీడియోలో జరిగిన సంభాషణల ప్రకారం నల్ల ట్ షర్ట్ వేసుకున్న వ్యక్తి తనని వోట్ అడగడానికి వచ్చిన వ్యక్తిని రోడ్డు వేయమని అడుగుతున్నట్టు తెలుస్తుంది. అంతేగాని వీడియోలో ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన వ్యవసాయ బిల్లు గురించి గాని కరెంటు బిల్లు గురించిగాని ప్రస్తావించలేదు. పైగా వీడియో ఓట్లు అడగడానికి వచ్చింది వ్యక్తి BJP పార్టీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పడానికి కూడా తగిన ఆధారాలు లేవు. వీటన్నిటి బట్టి పోస్టులో ఉన్న వీడియోకి కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ, విద్యుత్ బిల్లులకిగాని బీహార్ కిగాని ఎటువంటి సంబంధం లేదని కచ్చితంగా చెప్పొచ్చు. 

ఇప్పుడు బీహార్ లో జరుగుతున్న జనరల్ ఎన్నికలు మరియు దుబ్బాక లో జరగబోయే ఉప ఎన్నిక నేపథ్యంలో పోస్టులో ఉన్న వార్తలాంటి తప్పుదోవ పట్టించే వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.

చివరగా, ఈ వీడియోకి కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ, విద్యుత్ బిల్లులకిగాని బీహార్ కిగాని ఎటువంటి సంబంధం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll