‘ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దాడి దృశ్యాలు’, అని చెప్తూ కొన్ని వీడియోలని సోషల్ మీడియాలో చాలా మంది పోస్ట్ చేస్తున్నారు. తాజాగా చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపుర్‌లో భద్రతా దళాల పై మావోయిస్టులు దాడి చేసినట్టు తెలిసిందే. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: తాజాగా చత్తీస్‌గఢ్ లోని బీజాపుర్‌లో భద్రతా దళాల పై మావోయిస్టుల దాడికి సంబంధించిన దృశ్యాలు.
ఫాక్ట్: పోస్ట్ చేసిన రెండు వీడియోలు పాతవి. అవి తాజాగా చత్తీస్‌గఢ్ లో జరిగిన మావోయిస్టుల దాడి దృశ్యాలు కావు. ఒక వీడియోని మయాన్మార్ దేశానికి చెందినట్టు గత నాలుగేళ్లగా కొందరు షేర్ చేస్తుంటే, మరో వీడియోని ఒకరు 2018 లోనే పోస్ట్ చేసారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని యాన్డెక్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, ఆ వీడియో ఇంటర్నెట్ లో ఎప్పటినుండో షేర్ అవుతున్నట్టు తెలిసింది. 2018 లోనే పోస్ట్ లోని వీడియోని పెట్టి, అది మయాన్మార్ (బర్మా) దేశానికి సంబంధించిన వీడియో అని కొందరు యూట్యూబ్ లో షేర్ చేసినట్టు ఇక్కడ చూడవొచ్చు. అలాంటి వీడియోలనే 2017లో కూడా మయాన్మార్ వీడియోలని చెప్తూ పెట్టినట్టు ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. అయితే, అది మయాన్మార్ దేశానికి చెందిన వీడియో అని కచ్చితమైన ఆధారాలు దొరకలేదు. కానీ, వీడియో ఎప్పటినుండో ఇంటర్నెట్ షేర్ అవుతుంది కాబట్టి, దానికీ తాజా మావోయిస్టులు దాడికి సంబంధంలేదనే నిర్ధారణకు రావొచ్చు.


పోస్ట్ లోని వీడియో గురించి ఇంటర్నెట్ లో కీ-వర్డ్స్ తో వెతకగా, అదే వీడియోని ఒకరు 2018 లోనే యూట్యూబ్ లో పోస్ట్ చేసినట్టు తెలిసింది. అంతేకాదు, ‘Kalinga TV’ వారు కూడా వీడియోని 2019లో పెట్టినట్టు ఇక్కడ చూడవొచ్చు. ఈ వీడియో కూడా పాతది కాబట్టి, ఇది కూడా తాజా మావోయిస్టులు దాడికి సంబంధించింది కాదని చెప్పవొచ్చు.

చివరగా, సంబంధంలేని పాత వీడియోలను పెట్టి, తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు చేసిన దాడి దృశ్యాలని తప్పుగా షేర్ చేస్తున్నారు.