వైమానిక దాడులు (Air Strikes), డ్రోన్ అటాక్స్, మరియు వాటికి సంబంధించిన బాంబు పేళ్ళుల దృశ్యాలు ప్రస్తుత రష్యా-ఉక్రెయిన్ సంక్షోభానికి సంబంధించినవని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా రష్యా ఉక్రెయిన్ పై సైనిక చర్యకు దిగిన నేపథ్యంలో ఈ విజువల్స్ బాగా షేర్ అవుతున్నాయి. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: రష్యన్ యుద్ధ విమానాన్ని కూల్చేసిన ఉక్రెయిన్ బలగాల దృశ్యాలు.
ఫాక్ట్: ఈ వీడియో పాతది. 2011లో లిబ్యాలో ఒక జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియో ఇది. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ఇదే విజువల్స్‌తో ఉన్న పూర్తి వీడియో ఒకటి ‘అసోసియేటెడ్ ప్రెస్’ వారి అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో 2011లోనే అప్లోడ్ చేసారు. ఈ యూట్యూబ్ వీడియో లిబ్యా దేశానికి సంభందించినదిగా వారు తెలిపారు.
క్లెయిమ్: ఉక్రెయిన్ పై రష్యా వైమానిక దాడుల దృశ్యాలు.
ఫాక్ట్: ఈ వీడియో 2020లో తీసింది. రష్యాలో జరిగిన ఒక పెరేడ్ కు సంభందించినది. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ఇదే విజువల్స్‌తో ఉన్న పూర్తి వీడియో ఒకటి యూట్యూబ్‌లో 2020లోనే అప్లోడ్ చేసారు. ఈ యూట్యూబ్ వీడియో రష్యా దేశంలో జరిగిన ఒక పెరేడ్ కు సంభందించినదిగా వారు తెలిపారు.
అప్డేట్: (MARCH 2, 2022)
క్లెయిమ్: ఉక్రెయిన్‌పై రష్యన్ ఫైటర్ జెట్‌ల విజువల్స్.
ఫాక్ట్: ఈ విజువల్స్ నిజంగా జరిగిన సంఘటనకు సంబంధించి కాదు, ARMA 3 వీడియో గేమ్ సాఫ్ట్ వేర్ ఉపయోగించి ఈ సిమ్యులేషన్ క్లిప్ తయారు చేసారు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ఇదే విజువల్స్‌తో ఉన్న వీడియో ఒకటి యూట్యూబ్‌లో 2020లోనే అప్లోడ్ చేసారు. ఈ యూట్యూబ్ వీడియో ఒక వీడియో గేమ్‌కు సంబంధించిన సిమ్యులేషన్ క్లిప్; AMA 3 వీడియో గేమ్ సాఫ్ట్ వేర్ ఉపయోగించి ఈ వీడియోను తయారు చేసారు.
క్లెయిమ్: ఉక్రెయిన్‌లో ప్రస్థుత పరిస్థితులకు సంబంధించిన విజువల్స్.
ఫాక్ట్: ఈ విజువల్స్ 2020లో అమెరికాలోని నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్య తర్వాత జరిగిన బ్లాక్ లైవ్స్ మ్యాటర్ నిరసనలకు సంబంధించినవి. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం మొదలు కాకముందే ఈ వీడియో ట్విట్టర్‌లో షేర్ అయ్యింది. 2020లో అమెరికాలోని నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్య తర్వాత జరిగిన బ్లాక్ లైవ్స్ మ్యాటర్ నిరసనల్లో భాగంగా జరిగిన సంఘటనలంటూ ఒక ట్విట్టర్ యూసర్ షేర్ చేసింది.
చివరగా, పాత వీడియోలను రష్యా-ఉక్రెయిన్ సంక్షోభానికి సంబంధించినదిగా షేర్ చేస్తున్నారు.