“ఇజ్రాయెల్ ప్రపంచంలోని ప్రతి దేశంలో ఉన్న యూదులను ఇజ్రాయెల్ తీసుకువెళ్లడానికి ప్రయత్నాలు చేస్తుంది. అత్యాధునిక విధానాలతో డిఎన్‌ఏ టెస్టులు చేస్తున్నారు. వారి మూలాలు యూదుల మూలలతో కలిస్తే వారిని తమదేశం తీసుకువెళ్లడానికి అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు”, అని చెప్తూ ఒక పోస్ట్‌ని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఇతర దేశాల్లో ఉన్న యూదుల యొక్క మూలాలు, ఇజ్రాయెల్ యూదుల మూలలతో డీఎన్‌ఏ టెస్టులో కలిస్తే, వారిని తమదేశం తీసుకువెళ్లడానికి ఇజ్రాయెల్ అన్నీ ఏర్పాట్లు చేస్తున్నది.
ఫాక్ట్: పోస్ట్‌లో చెప్పినట్టు ఇతర దేశాల్లో ఉన్న యూదులందరినీ ఇజ్రాయెల్ దేశానికి తీసుకుని వెళ్లడానికి వివిధ దేశాల్లో ఉన్న అందరి యూదుల డీఎన్‌ఏ టెస్టులను ఇజ్రాయెల్ ప్రభుత్వం నిర్వహించట్లేదు. కేవలం, కొన్ని కేసుల్లో మాత్రం మూలాలు తెలుసుకోవడానికి డీఎన్‌ఏ టెస్టును ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా మూలాలు తెలుపడానికి వేరే ఏ అధికారిక పత్రాలు లేనప్పుడు యూదుల మూలాలు చూపెట్టడానికి కొంత మంది డీఎన్‌ఏ టెస్టుకు వెళ్తున్నారు. కావున పోస్ట్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
పోస్ట్‌లో చెప్పిన విషయాల గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఇతర దేశాల్లో ఉన్న యూదులందరినీ ఇజ్రాయెల్ దేశానికి తీసుకుని వెళ్లడానికి వివిధ దేశాల్లో ఉన్న అందరి యూదుల డీఎన్‌ఏ టెస్టులను ఇజ్రాయెల్ ప్రభుత్వం నిర్వహిస్తున్నట్టు ఎక్కడా ఎటువంటి అధికారిక సమాచారం దొరకలేదు. ఇజ్రాయెల్ పౌరసత్వానికి సంబంధించిన ‘లా అఫ్ రిటర్న్’ నిబంధనల్లో కూడా ఇతర దేశాల్లోని యూదులకు డీఎన్‌ఏ టెస్టులు నిర్వహిస్తున్నట్టు లేదు. ‘లా అఫ్ రిటర్న్’ నిబంధనల్లో వివిధ షరతులు కూడా ఉన్నాయి.
అయితే, కొన్ని కేసుల్లో మాత్రం మూలాలు తెలుసుకోవడానికి డీఎన్‌ఏ టెస్టును ఉపయోగిస్తున్నట్టు తెలిసింది. ముఖ్యంగా మూలాలు తెలుపడానికి వేరే ఏ అధికారిక పత్రాలు లేనప్పుడు కొంత మంది తమ యూదుల మూలాలు చూపెట్టడానికి డీఎన్‌ఏ టెస్టుకు వెళ్తున్నారు.
కేవలం డీఎన్‌ఏ టెస్టులో యూదుల యొక్క మూలాలు ఉంటే ఇజ్రాయెల్ పౌరసత్వానికి సరిపోదు అని ఇజ్రాయెల్ ఇమ్మిగ్రేషన్ లాయర్ జాషువా పెక్స్ చెప్పినట్టు ఇక్కడ చూడవచ్చు.
ఇజ్రాయెల్ పౌరసత్వం మరియు డీఎన్‌ఏ టెస్టులపై ప్రచురించినబడిన వివిధ వార్తలు మరియు రీసెర్చ్ ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చదవచ్చు.
చివరగా, ప్రపంచంలో ఉన్న యూదులందరినీ ఇజ్రాయెల్ దేశానికి తీసుకుని వెళ్లడానికి ప్రతి దేశంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం డీఎన్‌ఏ టెస్టులను నిర్వహించట్లేదు.