Fake News, Telugu
 

వెంకటేశ్వర స్వామి పాత వీడియోని కరోనా టైం లో భక్తుల కోసం తీసిందంటూ షేర్ చేస్తున్నారు

0

‘కరోనా కారణంగా తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకోలేని వారి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం వారు చరిత్రలో మొట్టమొదటిసారిగా స్వామివారి మూలవిరాట్టు వీడియోకి అనుమతించారు’ అని చెప్తూ వెంకటేశ్వర స్వామి వీడియో షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ‘కరోనా కారణంగా తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకోలేని వారి కోసం దేవస్థానంవారు చరిత్రలో మొట్టమొదటిసారిగా స్వామివారి మూలవిరాటుని వీడియో తీసారు.’

ఫాక్ట్(నిజం): ఈ వీడియో పాతది, 2013 నుండే ఈ వీడియో యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. కరోనా టైంలో భక్తుల కోసం TTD వారు వెంకటేశ్వర స్వామి వీడియో తీసినట్టు ఎటువంటి అధికారిక సమాచారం గాని లేక వార్తా కథనాలు గాని లేవు.  కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఈ వీడియో కరోనా సమయంలో తీసింది కాదు. యూట్యూబ్ లో కీవర్డ్ సెర్చ్ చేయగా ఇదే వీడియోని 2013లోనే అప్లోడ్ చేసినట్టు తెలిసింది. ఈ వీడియోని ‘Bala Govinda Dasa’ అనే యూట్యూబ్ ఛానల్ లో ‘Original Tirumala Moolavar – 40 Seconds Video’ అనే టైటిల్ తో 2013లోనే అప్లోడ్ చేసారు.

ఐతే ఈ వీడియో ఎప్పుడు తీసారో, పైగా ఈ వీడియో తిరుపతి ఆలయానికి సంబంధించిందో కాదు కూడా కచ్చితమైన ఆధారాలు తెలియనప్పటికీ, ఈ వీడియో మాత్రం ఇప్పటి కరోనా టైంలో తీసింది కాదని కచ్చితంగా చెప్పొచ్చు. పైగా కరోనా టైంలో భక్తుల కోసం TTD ఇలా వెంకటేశ్వర స్వామి వీడియో తీసినట్టు ఎటువంటి అధికారిక సమాచారం లేదు. ఒకవేళ నిజంగానే ఇలా జరిగుంటే ఈ విషయాన్నీ వార్తా సంస్థలు ప్రచురించేవి, కాని ఈ విషయానికి సంబంధించి ఎటువంటి వార్తా కథనాలు లేవు. తిరుపతి ఆలయ వీడియో ఇక్కడ చూడొచ్చు.

చివరగా, వెంకటేశ్వర స్వామి యొక్క పాత వీడియోని కరోనా టైం లో భక్తుల కోసం తీసిందంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll