Fake News, Telugu
 

మహబూబాబాద్‌ మహా ధర్నా సభలో ‘గో బ్యాక్ కేటీఆర్’ అని ప్రజలు నినాదాలు చేశారని ఒక ఎడిట్ చేసిన వీడియోను షేర్ చేస్తున్నారు

0

లగచర్ల సంఘటనకి నిరసనగా, 25 నవంబర్ 2024న మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ నిర్వహించిన మహా ధర్నా కార్యక్రమంలో ‘గో బ్యాక్ కేటీఆర్’ అని ప్రజలు నినాదాలు చేశారని చెప్తూ సోషల్ మీడియాలో ఒక వీడియో(ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) వైరల్ అవుతోంది.  “కేటీఆర్ కు నిరసన సెగ… గో బ్యాక్ కేటీఆర్ అంటూ నినాదాలు,” అని క్లెయిమ్ చేస్తున్న ఈ వీడియోలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతుండగా కొందరు ‘గో బ్యాక్ కేటీఆర్’ అని నినాదాలు చేయడం మనం గమనించవచ్చు. అసలు ఈ వీడియో వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

ఈ వీడియో యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: మహబూబాబాద్ మహా ధర్నా కార్యక్రమంలో కేటీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో ‘గో బ్యాక్ కేటీఆర్’ అని ప్రజలు నినాదాలు చేసారు, దానికి సంబంధించిన వీడియో. 

ఫ్యాక్ట్(నిజం): ఇది ఒక ఎడిట్ చేసిన వీడియో. అసలు వీడియోలో కేటీఆర్ ప్రసంగిస్తున్నప్పుడు, సభకి వచ్చిన ప్రజల్లో కొందరు ‘సీఎం సీఎం’ అని అరిచారు. ఆ వీడియోకి ఫిబ్రవరి 2024లో కొందరు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కేటీఆర్ కాన్వాయిని ‘గో బ్యాక్ కేటీఆర్’ అని అరుస్తూ అడ్డుకున్న సంఘటనకి చెందిన వీడియోలోని ఆడియోని జోడించి ఎడిట్ చేశారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలను తెలుసుకోవడాని 25 నవంబర్ 2024న మహబూబాబాద్‌లోని  బీఆర్ఎస్ నిర్వహించిన మహా ధర్నా కార్యక్రమం యొక్క లైవ్ స్ట్రీమ్ ఫుటేజీని చెక్ చేశాము (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ).

వైరల్ వీడియోలో కనిపిస్తున్న విజువల్స్ మాకు 32:42 టైమ్‌స్టాంప్ దగ్గర కనిపించాయి.  కేటీఆర్ ప్రసంగం చేస్తూ ‘మొన్న లగచర్ల ఆడబిడ్డలు..’ అని అన్న తర్వాత, కొందరు వైపు చెయ్యి చూపించి, ఆపమని అంటాడు.  ఇక్కడ వారు ‘సీఎం సీఎం సీఎం…’ అని నినాదాలు చేస్తూ ఉంటారు. వైరల్ వీడియోలో అన్నట్లు ‘గో బ్యాక్ కేటీఆర్’ అని కాదు. అంటే కేటీఆర్ మాట్లాడుతుండగా, ప్రజలు ‘సీఎం’ అని అరిచిన ఆడియోను ‘గో బ్యాక్ కేటీఆర్’ అనే ఆడియోతో మార్చి ఈ వీడియో తయారు చేశారు అని అర్థం చేసుకోవొచ్చు.

అసలు ‘గో బ్యాక్ కేటీఆర్’ నినాదాలు ఉన్న ఆడియోకి చెందిన వీడియో ఏది అని తెలుసుకోవడానికి, తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికాము. ఈ ఆడియో, మాకు ఫిబ్రవరి 2024 నాటి కొన్ని వీడియో రిపోర్టులలో దొరికింది (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ). హైదరాబద్‌లోని అంబర్పేటలో కేటీఆర్ కాన్వాయిని కొందరు యూత్ కాంగ్రెస్ సభ్యులు ‘కేటీఆర్ గో బ్యాక్’ అని అరుస్తూ అడ్డుకున్నారు(ఆర్కైవ్ లింక్). ఈ సంఘటనకి చెందిన ఆడియోని వైరల్ వీడియో ఉపయోగించి వైరల్ వీడియోని ఎడిట్ చేశారు. 

ఇదిలా ఉంచితే, 25 నవంబరున జరిగిన మహా ధర్నా సభకి ముందు, మహబూబాబాద్‌లో ఏర్పాటు చేసిన కొన్ని ఫ్లెక్సీ బ్యానర్లను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చింపివేశారని (ఇక్కడ, ఇక్కడ), ‘కేటీఆర్ గో బ్యాక్’ అంటూ కొన్ని ఫ్లెక్సీలు కూడా వెలిశాయి అని కొన్ని వార్తా కథనాలు వచ్చాయి. అయితే, మహా ధర్నా ప్రసంగం సమయంలో ప్రజలు ‘గో బ్యాక్ కేటీఆర్’ అని అరిచారని గానీ, నిరసన తెలిపారని గానీ మాకు ఎటువంటి వార్తా కథనాలు దొరకలేదు.

చివరిగా, మహబూబాబాద్‌ మహా ధర్నా సభలో ‘గో బ్యాక్ కేటీఆర్’ అని ప్రజలు నినాదాలు చేశారని ఒక ఎడిట్ చేసిన వీడియోను షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll